Begin typing your search above and press return to search.
వైఎస్ వివేకా హత్య కేసుపై సీపీబీఐ చీఫ్ కు ఎంపీ రఘురామ లేఖ
By: Tupaki Desk | 26 March 2022 1:30 PM GMTసీబీఐ చీఫ్ కు ఎంపీ రఘురామరాజు లేఖ రాసి సంచలనం సృష్టించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని లేఖలో కోరారు. అయితే పరిటాల కేసులో మాదిరిగానే నిందితులను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని రఘురామ అన్నారు. జైల్లో, జైలు బయట ఉన్న నిందితులు, సాక్షులకు రక్షణ కల్పించాలని లేఖలో కోరారు.
హత్య వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో తేల్చాలని, ఎంపీ విజయాసాయిరెడ్డిని విచారించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ ప్రతిష్టకూ భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. ఆయనను చంపింది ఎవరనేది తేలలేదు. అయితే ఇప్పుడు ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ ఇటీవల చేసిన విచారణలో కొత్త కోణాలు వెలుగుచూశాయి. సీబీఐ విచారణను వేగవంతం చేసింది. త్వరలోనే కేసు తేలిపోతుందని భావిస్తున్న తరుణంలో ఈ విచారణకు ఒక్కసారిగా బ్రేక్ పడింది.
వివేకా హత్య కేసులో జులైలో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయి హత్యకు గల కారణాలను సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న విషయాలపై దర్యాప్తు చేశారు.
వైఎస్ వివేకా హత్యపై ఆయన కూతురు హైకోర్టుకెక్కడంతో సీబీఐ దర్యాప్తును ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. మార్చిలోనే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ జగన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే ఇంతలో కరోనా రావడం.. లాక్ డౌన్ తో సీబీఐ రంగంలోకి దిగలేదు. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. దీంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
ఈ కేసు ఎంతకూ తెగకపోవడంతో ప్రస్తుతం ఆ కేసు విచారణను వేగవంతం చేయాలని ఎంపీ రఘురామ తాజాగా సీబీఐకి లేఖరాయడం సంచలనమైంది.