Begin typing your search above and press return to search.

వార‌స‌త్వంపై ప‌వ‌న్‌కు యువ ఎంపీ ఘాటు కౌంట‌ర్

By:  Tupaki Desk   |   7 Dec 2017 2:32 PM GMT
వార‌స‌త్వంపై ప‌వ‌న్‌కు యువ ఎంపీ ఘాటు కౌంట‌ర్
X
ప్ర‌జ‌ల‌కు మ‌రింత‌ చేరువ అయ్యేందుకు కార్యాచ‌ర‌ణ పెట్టుకున్న సంద‌ర్భంగా తొలిరోజే జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. వార‌స‌త్వ రాజ‌కీయ నాయ‌కులు త‌మ‌ను తాము నిరూపించుకున్న త‌ర్వాతే ప‌ద‌వుల గురించి ఆకాంక్షించాల‌ని ప‌వ‌న్ హిత‌బోధ చేశారు. దీనిపై ఇప్ప‌టికే ప‌లువురు త‌మ‌దైన శైలిలో రియాక్ట‌వ‌గా...జ‌నసేన మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ సైతం ఘాటుగానే స్పందించింది.

దివంగ‌త ఎంపీ - టీడీపీ సీనియ‌ర్ నేత ఎర్ర‌న్నాయుడు త‌న‌యుడు కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు ప‌వన్ కామెంట్ల‌ పై ఒకింత ఘాటుగానే రియాక్ట‌య్యారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నామ‌ని రామ్మోహ‌న్ నాయుడు అన్నారు. తాము రాజ‌కీయాల్లోకి వార‌స‌త్వం రూపంలో వ‌చ్చిన‌ప్ప‌టికీ...త‌మ‌కంటూ ఒక గుర్తింపును సంత‌రించుకున్నామ‌ని వివ‌రించారు. వార‌స‌త్వంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ...తామేంటో నిరూపించుకోగ‌ల‌మ‌ని రామ్మోహ‌న్ నాయుడు అన్నారు. అయితే ఇందుకో అవ‌కాశం ద‌క్కాల్సి ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆ అంశాల‌ను ప‌వ‌న్ గ‌మ‌నించాల‌ని కోరారు.

కాగా, టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వార‌సుడిగా తెర‌మీద‌కు వ‌చ్చిన మంత్రి నారా లోకేష్ విష‌యంలో ప‌వ‌న్ స్పంద‌న‌ను రామ్మోహ‌న్ నాయుడు త‌ప్పుప‌ట్టారు. లోకేష్‌పై ప‌వ‌న్ కామెంట్లు స‌రికాద‌న్నారు. త‌న శాఖలైన ఐటీ, పంచాయ‌తీ రాజ్‌ల ద్వారా లోకేష్ న‌వ్యాంధ్ర‌ప్ర‌దేవ్ అభివృద్ధికి కృషిచేస్తున్నార‌ని అన్నారు. ఇప్ప‌టికే ప‌లు ఐటీ కంపెనీల‌ను రాష్ట్రానికి తీసుకువ‌చ్చార‌ని తెలిపారు.