Begin typing your search above and press return to search.

సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసంపై స్పందించిన ఎంపీ రఘురామ

By:  Tupaki Desk   |   3 Jan 2022 9:41 AM GMT
సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసంపై స్పందించిన ఎంపీ రఘురామ
X
ఏపీలో విగ్రహాల ధ్వంసం విచారకరమని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. దేవుళ్ల విగ్రహాలను.. దేవుడు లాంటి ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.పట్టపగలు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నా వైసీపీ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు.

ఇంట్లోనే ఉండే సీఎం ఏపీలో తప్ప మరెక్కడా ఉండరని ఎంపీ రఘురామ ఆరోపించారు. ఆలయాలకు ధార్మిక సంస్థలు గతంలో ఉండేవని.. ఇప్పుడు లేవని అన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తారని కథనాలు వస్తున్నాయని.. తమ సీఎం.. పీఎంను కలిశాక మాట్లాడుతానని ప్రకటించారు.

కడప వ్యవహారాలను కూడా ప్రధానితో జగన్ చర్చిస్తారనుకుంటా? అని ఎంపీ రఘురామ ఎద్దేవా చేశారు. జగన్ బెయిల్ పిటీషన్ ఎందుకు ఆలస్యం అవుతుందో దేవుడికే తెలియాలని.. కోర్టు అంశంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుంది? అని ప్రశ్నించారు. విగ్రహాలపై దాడి చేసిన వారిని పోలీసులు పట్టుకోవడం లేదన్నారు.

ఏపీలో ఇళ్లపై ఇష్టానుసారంగా పన్నులు విధిస్తున్నారని.. ఇంట్లో కట్టుకున్న బాత్ రూం పైనా పన్ను వేస్తున్నారని విమర్శించారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని ఎన్టీఆర్ చెప్పారని.. కానీ జగన్ మాత్రం పేదలకు సినిమా టికెట్ ధరలు తగ్గించామంటున్నారని రఘురామ విమర్శించారు.

-బీజేపీలో చేరికపై రఘురామ క్లారిటీ
జగన్ ఢిల్లీ పర్యటన అనంతరం వచ్చే సమాచారం మేరకు తాను పార్టీ మారే అవకాశాన్ని పరిశీలిస్తానని ఎంపీ రఘురామ స్పష్టం చేశారు.