Begin typing your search above and press return to search.
కేటీఆర్ కు తమ్ముడి గిఫ్ట్.. వెనుక కథ ఇదే
By: Tupaki Desk | 24 July 2019 4:45 AM GMTఈరోజు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. టీఆర్ ఎస్ శ్రేణులకు పండుగ రోజు. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత అంతటి శక్తిసామర్థ్యాలు, పార్టీ వ్యవహారాలన్నీ చూస్తున్న కేటీఆర్ బర్త్ డే సందర్భంగా వేడుకలు- ఫ్లెక్సీలు- కటౌట్లు- కేక్ కటింగ్ లు జరగడం సహజం. కానీ అవేవీ వద్దని ట్విట్టర్ లో కేటీఆర్ తన పార్టీ శ్రేణులకు సూచించారు. దానికి బదులు గిఫ్ట్ ఏ స్మైల్ హ్యాష్ టాగ్ తో పేదలకు తన బర్త్ డే సందర్భంగా సేవ చేయాలని వారి మోములో ఆనందం చూడాలని పిలుపునిచ్చారు.
ఇప్పుడు టీఆర్ ఎస్ శ్రేణులంతా ఇదే బాట పట్టారు. సామాజిక సేవ చేస్తున్నారు. పేదలకు బియ్యం- రోగులకు పండ్లు పంచుతున్నారు. అనార్థులకు సాయం చేస్తున్నారు. ఇక కేటీఆర్ చిన్నమ్మ కొడుకు తమ్ముడైన రాజ్యసభ ఎంపీ సంతోష్ అన్నకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు. ఏకంగా ఓ ఫారెస్ట్ ను దత్తత తీసుకొని అపూర్వ బహుమతిని ఇచ్చాడు.
మేడ్చల్ జిల్లాలోని కొండలు నెలవైన ప్రాంతం కీసర. ఇక్కడ కొన్ని దశాబ్ధాల క్రితం దట్టమైన అడవి ఉండేది. ఔషధ మూలిక చెట్లు ఉండేవట.. ఇక్కడికి వస్తే ఎంతో ప్రకృతి సిద్ధ వాతావరణం ఉండి రోగాలు కూడా నయమయ్యేవని ప్రతీతి. శ్రీరాముడు ఇక్కడి ప్రకృతి సంపదకు తరించి వచ్చి ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేయించారని పురాణగాథ. ఇప్పటికీ ఇక్కడ అతిపురాతన శివలింగం ఉంది.
అయితే ఆ ప్రకృతి ఇప్పుడు లేదు.. మొత్తం గుట్టలు కరిగి.. అడవి అనేదే లేకుండా పోయింది. అందుకే దీన్ని మళ్లీ పచ్చబడేలా చేసేందుకు సంతోష్ నడుం బిగించాడు. 2042 ఎకరాల ఈ అటవీ విస్తీర్ణాన్ని దత్తత తీసుకొని తన ఎంపీ నిధులతో ఎకో టూరిజం పార్కుగా తీర్చిదిద్దుతాని ప్రకటించాడు. ఇలా అన్నకు ప్రకృతి సిద్ధంగా గిఫ్ట్ ఇచ్చి సంతోష్ ఆశ్చర్యపరిచాడు.