Begin typing your search above and press return to search.
కొవిడ్ కారణంగా తొలిసారి ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్
By: Tupaki Desk | 29 April 2021 2:52 AM GMTకరోనా పెద్ద విషయమే కాదని మొదట్లో సింఫుల్ గా తేల్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ కో సెకండ్ వేవ్ లో దాని కారణంగా దాదాపు అందరూ దాని బారిన పడినోళ్లే. అయితే.. రాజ్యసభ సభ్యుడు.. కేసీఆర్ బంధువు జోగినపల్లి సంతోష్ మినహా మిగిలిన వారంతా హోం ఐసోలేషన్ తోనే కరోనాను జయించారు. సీఎం కేసీఆర్ సైతం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రాలేదు. ఫాంహౌస్ లోనే ఉండి ఆయన మహమ్మారి నుంచి బయటపడ్డారు. వయసులో పెద్దవాడై.. ఆరోగ్య సమస్యలు ఉన్న కేసీఆర్ హోంఐసోలేషన్ తో బయటపడగా.. వయసులో చాలా చిన్నవాడైన సంతోష్ మాత్రం అందుకు భిన్నంగా ఆసుపత్రిలో చేరాల్సి రావటం గమనార్హం.
కరోనా పాజిటివ్ అయిన తర్వాత నుంచి ఇంటికే పరిమితమైన ఎంపీ సంతోష్.. బుధవారం యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఎందుకిలా? ఆయనకు ఏమైంది?అన్నది ప్రశ్నగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కోవిడ్ ఇష్యూస్ తో పాటు.. మరికొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తటంతో ముందుజాగ్రత్తల్లో భాగంగా ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. కేసీఆర్ కు వ్యక్తిగత వైద్యుడైన ఎంవీ రావు దగ్గరుండి సంతోష్ ఆరోగ్య సమస్యల్ని అధిగమించేందుకు వీలుగా వైద్యం చేస్తున్నారు.
ఎంపీ సంతోష్ కు కరోనా పాజిటివ్ గా తేలి వారం రోజులైంది. ఇన్నాళ్లు బాగానే ఉన్నా.. తాజాగా జ్వరం రావటం.. లక్షణాల విషయంలో ఉన్న సందేహాలతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. కోవిడ్ కారణంగా కేసీఆర్ కుటుంబంలోని వారెవరికి లేని రీతిలో.. సంతోష్ కు మాత్రం ఆసుపత్రిలో చేరి..చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన తర్వలోనే కరోనాను జయించి.. డిశ్చార్జి అవుతారని చెబుతున్నారు.