Begin typing your search above and press return to search.

ఎంపీ సార్ మీ రికార్డు తిర‌గ‌రాయ‌లేరు... జ‌నం మాట‌..!

By:  Tupaki Desk   |   29 April 2022 9:29 AM GMT
ఎంపీ సార్ మీ రికార్డు తిర‌గ‌రాయ‌లేరు... జ‌నం మాట‌..!
X
ఎంపీసార్‌.. మీ ప‌నిత‌నం మాకు న‌చ్చ‌లేదు.. మీ రికార్డును మీరు తిర‌గ‌రాయ‌లేరు! ఇదీ.. కీల‌క‌మైన సీమ‌జిల్లాల్లోని ఒక ఎంపీకి స్థానిక ప్ర‌జ‌లు తేల్చి చెబుతున్న మాట‌. వ‌య‌సు రీత్యా పెద్దాయ‌న కావ‌డం ఒక కార‌ణ‌మైతే.. ఆయ‌న త‌న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో ఒకే ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమితం అయ్యార‌ని.. ఆయ‌న వ‌ల్ల పార్ల‌మెంటు ప‌రిధిలోని మిగిలిన ఆరు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఉసూరు మంటున్నాయ‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు.

ఇలా ఎందుకు జ‌రిగిందంటే.. ఇటీవ‌ల ఎమ్మెల్యే ప‌నితీరుపై ప్ర‌శాంత్ కిశోర్‌.. నివేదిక ఇచ్చారు. దీనికి సమాంత‌రంగా.. సీఎం జ‌గ‌న్‌.. ఎంపీల ప‌నితీరు పై వ‌లంటీర్ల‌తో స‌ర్వే చేయించారు. అది కూడా అన్ని చోట్లా కాకుండా ర్యాండంగా త‌న‌కు అందిన ఫిర్యాదుల నేప‌థ్యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్ల‌మెంటు స‌భ్యుల ప‌నితీరును ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీ లించారు. దీనిలో తూర్పులోని ఓ యువ ఎంపీపైనా.. నివేదిక అందింది. దీంతో ఆయ‌న‌ను కూడా త‌ప్పించి.. ఈ సారి అసెంబ్లీకి తీసుకునే చ‌ర్య‌లు చేప‌డుతున్నార‌ని స‌మాచారం.

ఇక‌, సీమ‌లోని ఒకే ఒక్క ఎంపీ వ‌యోవృద్ధుడు కావ‌డంతో ఆయ‌న పెద్ద‌గా నియోజ‌క‌వ‌ర్గం లో ఉండ‌డంలేదు. అయితే.. ప్ర‌తిప‌క్ష నేత‌కు చెందిన నియోజ‌క‌వ‌ర్గం లో మాత్రం వైసీపీని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. ఈ ఒక్క విష‌యంలోనే ఆయ‌న‌కు సీఎం జ‌గ‌న్ వ‌ద్ద మంచి మార్కులు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ టికెట్ ఇవ్వ‌కుండా.. ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇవ్వాల‌ని.. లేదు బ‌ల‌వంతం చేస్తే.. రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

అయితే.. ఈ విష‌యంలో మ‌రో మంత్రి ఆయ‌న స‌న్నిహితుడు కూడా కాద‌ని చెబుతున్నార‌ని.. ఇప్పుడే తొంద‌ర ఎందుకు మ‌రో రెండేళ్ల స‌మ‌యం ఉందిక‌దా.. అప్పుడు చూడొచ్చు.. అని సూచ‌న చేశార‌ని వైసీపీ వ‌ర్గాలే చెబుతున్నాయి. ఇదిలావుంటే.. తూర్పులో మాత్రం యువ ఎంపీని ఖ‌చ్చితంగా మార్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పార్టీలో ఆయ‌న నేనే మోనార్క్ అనే త‌ర‌హాలో రాజ‌కీయాలు చేస్తుండ‌డంపై ఓ కీల‌క సామాజిక వ‌ర్గం నుంచి జ‌గ‌న్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఆయ‌న‌ను మార్చ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు ఇచచ్చేశారు.

అయితే.. పార్టీకి, జ‌గ‌న్‌కు ఆయ‌న విధేయుడు కావ‌డంతో ఎంపీగా ఉంచేక‌న్నా.. ఒక‌నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం చేయాల‌ని.. జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌ద‌రు ఎంపీకి కూడా స‌మాచారం అందింది. దీంతో ఆయ‌న అప్ప‌టి నుంచి కొంత వెన‌క్కి త‌గ్గి.. త‌న ప‌నితాను చేసుకుంటున్నారు. అయినా.. కూడా ఆయ‌న‌ను మార్చాల్సిందేన‌ని.. స‌ద‌రు సామాజిక‌వ‌ర్గంలో యువ నాయ‌కుడు.. జ‌గ‌న్‌కు మిత్రుడు కూడా అయిన‌.. యువ ఎమ్మెల్యే పోరు పెడుతున్నారు. దీంతో ఇక్క‌డ మార్పు ఖాయ‌మ‌ని అంటున్నారు.