Begin typing your search above and press return to search.
మా ‘బాబు’ కానీ అలిగారంటేనా..?
By: Tupaki Desk | 1 Aug 2016 1:57 PM GMTప్రత్యేక హోదా విషయంలో ఏం చేయాలో పాలుపోక కిందామీదా పడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న అవస్థ అందరికి తెలిసిందే. గుండెలు మండుతున్నా.. మనసులోని మంట పెదవి దాటటకుండా జాగ్రత్తపడుతున్న పరిస్థితి. విడాకులు కానీ ఇచ్చేస్తే తర్వాత చోటు చేసుకునే పరిణామాల మీద ఆయనకున్న భయాలు ఆయన చేత తొందరపడనీయకుండా చేస్తున్నాయని చెప్పొచ్చు. మోడీ లాంటి ప్రజాకర్షక నేతతో పెట్టుకుంటే భవిష్యత్ ఎలా ఉంటుందన్న విషయాన్ని తేల్చుకోలేనితనం ఆయన్ను రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్న పరిస్థితి. ఇలాంటి మైండ్ సెట్ ఉందన్న విషయం ఆదివారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టంగా కనిపించింది.
ఆగ్రహంతో అరుణ్ జైట్లీ మీద మూడు నాలుగు సార్లు మండిపడేలా మాట మొదలు పెట్టినా.. ఆయనలోని అతి జాగ్రత్త మాటను పూర్తిగా అనలేక మింగేసేలా చేసిన పరిస్థితి. తమ ఎంపీలు సోమవారం పార్లమెంటు గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతారని చెప్పినట్లే.. తెలుగు తమ్ముళ్లు బాబు బొమ్మ ఉన్న బ్యాన్లు పట్టుకొని ప్రత్యేక హోదా గురించి నినాదాలు చేసేపరిస్థితి. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
విభజన సమయంలో రోజుకో వేషం వేస్తూ.. ఏపీకి జరిగే నష్టాన్ని వివరించే కన్నా.. వినోదాన్నే పంచారన్న పేరుంది. విభజన తర్వాత కేంద్రంతో తమ మిత్రపక్షం అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా కోసం నిరసన చేయాల్సి రావటం ఏమిటంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ అధినేత చంద్రబాబు గొప్పతనాన్ని తెగ కీర్తించిన ఆయన.. ధర్మరాజు లాంటోడని వ్యాఖ్యానించారు. తమ అధినేత తలొగ్గి మాట్లాడుతున్నారంటే అదంతా ఆయనలోని ధర్మరాజు గుణం వల్లనే తప్పించి మరొకటి కాదని.. బాబుకు అలగటమే తెలియదని.. అలాంటి ఆయన అలిగితే బీజేపీకి ఇబ్బందేనంటూ గొప్పలు చెప్పుకున్నారు. అలగని బాబు అలిగితే ఏం జరుగుతున్న శివప్రసాద్ కు.. అలాంటి అలుగుళ్లకు ఎలాంటి చెక్ చెప్పాలో మోడీకి బాగా తెలుసన్న విషయం మర్చిపోయినట్లున్నారు. చంద్రబాబుకు కోపం కానీ.. ఆవేశం కానీ అంత త్వరగా రాదని వ్యాఖ్యానించారు. నిజమే.. అవే ఉండి ఉంటే ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఏదో ఒకటి ఎప్పుడో తేలిపోయి ఉండేది. అవి లేకనే ఈ సాగతీత అంతా.