Begin typing your search above and press return to search.
ఎంపీ శివప్రసాద్ `దశావతారాలు`!
By: Tupaki Desk | 19 March 2018 11:35 AM GMTఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం కేంద్రంపై వైసీపీ, టీడీపీ ఎంపీలు పార్లమెంటు వెలుపల, లోపల కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ ఎంపీ శివ ప్రసాద్ తనదైన శైలిలో రోజుకో వేషం వేస్తూ పార్లమెంటు వెలుపల వినూత్న తరహాలో నిరసన తెలుపుతోన్న విషయం విదితమే. రకరకాల గెటప్ లలో శివ ప్రసాద్ నిరసన తెలుపుతున్న తీరు జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. తాజాగా, చీర కట్టుకుని మహిళ గెటప్ లో శివప్రసాద్ పార్లమెంటుకు వచ్చారు. మహిళంటే ఆకాశంలో సగమని, ఆంధ్రప్రదేశ్ మహిళగా కేంద్రాన్ని నిలదీస్తున్నానని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉద్యమిస్తారని, జాడించి కొడితే ఎక్కడో పోయి పడతావని ప్రధాని మోదీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``నువ్వు ఈ దేశానికి తగవు. చంద్రబాబులాంటి లీడర్ కు ద్రోహం చేస్తే ఇంకెక్కడ ఉంటావు?' అని మోదీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
అయితే, దశావతారంలో కమల్ హాసన్ తరహాలో....రకరకాల గెటప్స్ మారుస్తున్న శివ ప్రసాద్ పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఈ తరహా వేషాలతో ఏపీ పరువు తీస్తున్నారని కొందరు....వినూత్న రీతిలో నిరసన తెలుపడం మంచిదేనని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాల్లో కమల్ హాసన్ గా కొందరు శివప్రసాద్ ను అభివర్ణిస్తూ ఆయన `గెటప్స్` గురించి చర్చించుకుంటున్నారు.
చేతిలో వలతో నెత్తికి టోపీతో మత్స్య కారుడిలా - భుజంపై కుండ - చేతిలో కర్రతో సత్య హరిశ్చంద్ర అవతారంలో - కుర్రో.. కుర్రు.. అంటూ కోయదొర గెటప్ లో - రైతు గెటప్ లో - చేతిలో బైబిల్ పట్టుకుని చర్చి ఫాదర్ లా - ఎన్టీఆర్ గెటప్ లో - పోతురాజు వేషంలో - మెడలో పూలమాల - శ్రీకృష్ణుడి వేషధారణలో....పార్లమెంటు వెలుపల శివ ప్రసాద్ వినూత్న నిరసనను కొనసాగిస్తున్నారు.