Begin typing your search above and press return to search.

ఆ ఎంపీ వివ‌ర‌ణ ఇచ్చినా బాబు త‌గ్గ‌లేద‌ట‌

By:  Tupaki Desk   |   2 May 2017 9:27 AM GMT
ఆ ఎంపీ వివ‌ర‌ణ ఇచ్చినా బాబు త‌గ్గ‌లేద‌ట‌
X
మ‌న‌సులోని క‌ష్టాన్ని గుట్టుగా అధినాయ‌క‌త్వానికి చేర‌వేయాలే కానీ నోరు విప్పితే క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్యం అవుతుంది. ప్రాంతీయ పార్టీలో ఈ తీరు మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. అయితే.. ఇలాంటి వేళ‌లోనూ నోరు విప్పిన నేత‌ల కార‌ణంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌డుతున్న అవ‌స్థ‌లు అన్నిఇన్ని కావు. బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం కార‌ణంగా కిందామీదా ప‌డుతున్న చంద్ర‌బాబుకు.. సొంత‌పార్టీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లు చిరాకు పుట్టిస్తున్నాయి. బ‌ల‌మైన నేప‌థ్యం ఉన్న నేత‌ల్ని ఒక మాట అనేందుకు బాబు జంకుతార‌న్న మాట రాజ‌కీయ వ‌ర్గాల్లో త‌ర‌చూ వినిపిస్తుంటుంది. అందుకు త‌గ్గ‌ట్లే.. పార్టీ లైన్‌ కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించే ప‌లువురునేత‌ల‌పై పెద్ద‌గా రియాక్ట్ కానీ బాబు.. త‌న సొంత జిల్లాకు చెందిన ఎంపీ శివ‌ప్ర‌సాద్ ఈ మ‌ధ్య చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న గ‌రంగ‌రంగా ఉన్న విష‌యం తెలిసిందే.

పార్టీని ఇబ్బంది పెట్టేలా మాట్లాడొద్ద‌న్న వార్నింగ్ త‌ర్వాత కూడా శివ‌ప్ర‌సాద్ తీరు మార్చుకోక‌పోవ‌టంపై ఆయ‌న చాలా ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు చెబుతారు. ఇదిలా ఉంటే.. తాజాగా శివ‌ప్ర‌సాద్ అమ‌రావ‌తిలోని సీఎం అధికార నివాసంలో చంద్ర‌బాబును క‌లిశారు. ఈ సంద‌ర్భంగా శివ‌ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న సీరియ‌స్ అయిన‌ట్లుగా తెలుస్తోంది.

బాబు ఆగ్ర‌హాన్ని గుర్తించిన శివ‌ప్ర‌సాద్‌.. తాను చేసిన వ్యాఖ్య‌ల మ‌ర్మాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశార‌ని. అయితే బాబు దానికి స‌మాధాన‌ప‌డ‌లేద‌ని చెబుతున్నారు. త‌న మాట‌ల్లోనూ.. మ‌న‌సులోనూ దురుద్దేశాలు లేవ‌ని శివ‌ప్ర‌సాద్ చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ద‌ళితుల మ‌నోభావాలు.. వారిని మ‌రింత ద‌గ్గ‌ర‌కు తీసుకోవాల‌నే తాను మాట్లాడిన‌ట్లు చెప్పిన‌ప్ప‌టికీ.. ఆ త‌ర‌హా వ్యాఖ్య‌లు పార్టీకి.. ప్ర‌భుత్వానికి న‌ష్టం వాటిల్లేలా చేస్తాయ‌ని బాబు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

ఏదైనా విష‌యం ఉంటే త‌న దృష్టికి తీసుకురావాలే కానీ.. మీడియా ముందుకు వెళ్ల‌టం ఏమాత్రం బాగోలేద‌ని ఆయ‌న చెప్పినట్లుగా తెలిసింది. ఈ మ‌ధ్య‌న మీ వ్య‌వ‌హార‌శైలిలో మార్పు వ‌చ్చింద‌ని.. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు అవుతున్నారు కానీ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కాక‌పోవ‌టాన్ని బాబు ప్ర‌స్తావించిన‌ట్లుగా స‌మాచారం. దీనికి బ‌దులిచ్చిన శివ‌ప్ర‌సాద్ త‌న మ‌న‌సులో అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవ‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. తొలుత సీరియ‌స్ అయిన చంద్ర‌బాబు చివ‌ర‌కు మాత్రం కాస్తంత కూల్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. శివ‌ప్ర‌సాద్ పై త‌న‌కున్న అసంతృప్తిని చంద్ర‌బాబు సూటిగా వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/