Begin typing your search above and press return to search.
చౌదరి గారికి... వైఎస్ ట్యాగ్ యాడైంది!
By: Tupaki Desk | 14 July 2019 2:30 PM GMTసుజనా చౌదరి... టీడీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కోటరీలో అత్యంత ముఖ్యుడిగా పేరుపడ్డ నేతగా మనందరికీ తెలుసు. తన కోటరీలోని అందరికీ వారి స్థాయిలకు తగ్గట్లుగా పదవులు కట్టబెట్టిన చంద్రబాబు... సుజనాకు కూడా చాలా కాలం క్రితమే రాజ్యసభ సీటిచ్చేశారు. అంతేనా కేంద్ర మంత్రిగా కూడా సుజనాకు చాన్స్ ఇచ్చారు. తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కాగానే... సుజనా తన దారి తాను చూసుకున్నారు. టీడీపీకి చెందిన మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులను కలుపుకుని సుజనా కమలం గూటికి చేరిపోయారు.
అంతా బాగానే ఉన్నా... కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరి ఏనాడూ... తన పేరును యలమంచిలి సుజనా చౌదరిగా పేర్కొన్న దాఖలా లేదు, అయితే ఇప్పుడుఎ ఏమైందో తెలియదు గానీ... టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా విజయవాడ వస్తున్న సందర్భంగా ఆయన తన పేరు ముంగిట వైఎస్ ట్యాగ్ ను తగిలించేసుకున్నారు. ఆదివారం నాటి ప్రముఖ పత్రికల్లో ఇచ్చిన యాడ్స్ లో సుజనా.. తన పేరును వైఎస్ చౌదరిగానే పేర్కొన్నారు. అయితే వైఎస్ చౌదరి అంటే ఎక్కడ తనను గుర్తు పట్టరని అనుమానపడ్డారో, ఏమో తెలియదు గానీ... తన పేరు కింద బ్రాకెట్ లో సుజనా చౌదరి అని రాయించుకున్నారు. వైఎస్ అంటే... వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీగానే అంతా భావిస్తారు. ఇక వైఎస్ అన్న పదం వినబడిందంటే...ఢిల్లీలోనూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డినే గుర్తుకు వస్తారు.
ఇలాంటి నేపథ్యంలో సుజనా... తన పేరు ముంగిట వైఎస్ ట్యాగ్ ను తగిలించుకోవడం ఇప్పుడు నిజంగానే ఆసక్తి రేరెత్తిస్తోంది. గతంలో జగన్ ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటు లాబీల్లో జగన్ తో పాటు సుజనా కలిసిన వైనం, వారిద్దరూ చాలా సేపు ముచ్చటించుకోవడం ఆసక్తి రేకెత్తించింది. నిత్యం కత్తులు దూసుకునే జగన్, సుజనాలు అలా కలిసి ఏకాంతంగా చర్చలు జరపడమేమిటా? అన్న అనుమానాలూ రేకెత్తాయి. తాజాగా సుజనా తన పేరుకు వైఎస్ ట్యాగ్ ను తగిలించుకుని తాటికాయలంత అక్షరాలతో యాడ్స్ ఇవ్వడం చూస్తుంటే... అసలు సుజనా వ్యూహం ఏమిటన్న దిశగా ఆసక్తికర చర్చలకు తెర లేసింది.