Begin typing your search above and press return to search.

బీజేపీకి ఎంపీ గుడ్ బై

By:  Tupaki Desk   |   7 Nov 2021 4:30 PM GMT
బీజేపీకి ఎంపీ గుడ్ బై
X
ఉత్తరప్రదేశ్ లో ఈ ఎంపీ వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే అధికార బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ వ్యవహారం పార్టీకే పెద్ద తలనొప్పిగా తయారైంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ఎంపీ ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతుండటం ప్రతిపక్షాలకు మంచి ఆయుధం ఇచ్చినట్లయ్యింది. ఎందుకంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, సొంత పార్టీ ఎంపీ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఒకటిగానే ఉండటంతో ప్రభుత్వానికి ఏమి సమాధానం చెప్పాలో అర్థం కావటంలేదు.

ఇక్కడే వరుణ్ వ్యవహార శైలితో సొంతపార్టీ నేతల్లోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లఖింపూర్ ఖేరిలో రైతులపైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కొడుకు వాహనం దూసుకుపోవటంతో 4 రైతులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగినప్పటి నుండి సొంత ప్రభుత్వంపైనే వరుణ్ రెచ్చిపోతున్నారు. ఘటనపైనే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుణ్ పోస్టుచేసిన అనేక పోస్టులు వైరల్ గా మారాయి. ఇవన్నీ ప్రతిపక్షాల చేతికి ఆయుధాలుగా మారాయి.

ఈ విషయాలను పక్కన పెడితే తమ్ముడు వరుణ్ గాంధీకి ప్రియాంకకు మధ్య చర్చలు నడుస్తున్నాయనే ప్రచారం బాగా జరుగుతోంది. ఒకపుడు అంతా కలిసే ఉన్నా తర్వాత పరిణామాల్లో తల్లి మనేకాగాంధీతో కలిసి వరుణ్ కాంగ్రెస్ ను వదిలేసి బీజేపీలో చేరిపోయారు. అప్పటి నుండి తల్లీ, కొడుకులు బీజేపీ ఎంపీలుగానే కంటిన్యు అవుతున్నారు. అయితే కమలంపార్టీలో కూడా పరిస్ధితుల్లో తేడా వచ్చినట్లుంది. అందుకనే ఇద్దరినీ పార్టీ జాతీయ కమిటిలో నుండి తప్పించేశారు.

ఇదే సమయంలో మనేకాగాంధీ పార్టీ వ్యవహారాల గురించి మౌనంగా ఉండటం, వరుణ్ సొంత నాయకత్వంమీదే రెచ్చిపోతుండటంతో వీళ్ళపై తొందరలోనే ఏదో యాక్షన్ తీసుకుంటారనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే వరుణ్ కి సోదరి ప్రియాంకకు మధ్య చర్చలు మొదలయ్యాయని సమాచారం. బహుశా తొందరలోనే వరుణ్ గాంధీ కాంగ్రెస్ లో చేరే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. యూపీలోని యోగీ ప్రభుత్వం మీదే కాకుండా అంతకుముందు నరేంద్రమోడిని కూడా వరుణ్ డైరెక్టుగానే ఎటాక్ చేస్తున్నాడు.

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ ఎంపీ అనేకసార్లు కేంద్రాన్ని విమర్శించాడు. యూపీలో జరిగిన అనేక సమావేశాల్లో వేదికపైనుండే మోడీ నిర్ణయాన్ని తప్పుపడుతు వరుణ్ మాట్లాడటంతో అందరు ఆశ్చర్యపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడితే ఏదోరోజు చర్యలు తప్పవని తెలీనంత అమాయకుడు కాదు ఎంపీ. తెలిసీ మాట్లాడారంటేనే పార్టీ నుండి బయటకు వెళ్ళిపోవటానికి డీ అయిపోయినట్లే అర్ధమవుతోంది. మరి యూపీ ఎన్నికల్లోపే ఆ ముచ్చట జరుగుతుందేమో చూడాలి. అదే జరిగితే బీజేపీకి కాస్త ఇబ్బందనే అనుకోవాలి.