Begin typing your search above and press return to search.
బాబు గుట్టు బయటపెట్టిన సాయిరెడ్డి.. చాలా ఉందే...!
By: Tupaki Desk | 8 Aug 2019 11:06 AM GMTరాజకీయాల్లో ప్రత్యర్థులు నోరు విప్పితే.. పక్కవారికి పండగే.. అనే ఓ సామెత ఉంది.! ఇప్పుడు ఏపీలో పరిస్థితి పండగలాగానే ఉంది. ఏపీ సీఎం జగన్ బాట పట్టారు. దాదాపు రెండు రోజుల పాటు అక్కడే మకాం వేశారు. ఈ క్రమంలోనే ప్రధాని సహా అందరికీ ఒకసారి కలిశారు. అయితే, ఒకపక్క కశ్మీర్ వివాదం దేశాన్ని ఒణికించేస్తున్న సమయంలో ఇంతబిజీ సమయంలో జగన్‌కు ప్రధాని మోడీ అప్పాయిం ట్ మెంట్ ఎలా ఇచ్చారబ్బా! అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు సమాధానం చెప్పారు.
కేవలం తనపై ఫిర్యాదు చేసేందుకు, తనను జైలుకు పంపించేందుకు జగన్ తన పరివారంతో కలిసి ఢిల్లీ వెళ్లి వారిని కలిశారని చెప్పారు. ఇక, ఈ క్రమంలోనే చంద్రబాబు ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, దేశంలో బీజేపీని తరిమి కొట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. బీజేపీని అధికారం లోకి రాకుండా చూసేందుకు తాను ఎంత వరకైనా వెళ్తానని చెప్పారు. ఈ క్రమంలోనే కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా ఆయన పర్యటించి, రాజకీయ విమర్శలు చేశారు. కట్ చేస్తే, ఎన్నికల అనంతరం ఆయన ప్రతిపక్షానికి పరిమితమయ్యారు.
అయితే, ఇప్పుడు అదే బీజేపీతో ఆయన అంటకాగేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి. తాజాగా ఆయన తనట్వీట్‌లో చంద్రబాబుకు షాకిచ్చారు. జగన్ నేతృత్వంలోని మా బృందం ప్రధాని మోడీని కలిసింది. అయితే, దీనిపై బాబు చేస్తున్న విమర్శలు చాలా నవ్వు తెప్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, తమ అవినీతి ఎక్కడ బయటకు వస్తుందోనని బాబు భయపడుతున్నారని, అందుకే ఆయన తన ఎంపీలు నలుగురిని బీజేపీలోకి పంపి, ఏనాడో బీజేపీతో పొత్తుకు రెడీ అయ్యారని, తనపై జగన్ ప్రభుత్వం ఎలాంటి అవినీతి కేసులు పెట్టకుండా చూసుకునే క్రమంలోనే ఆయన ముందు జాగ్రత్తగా కేంద్రంతో చేతులు కలిపారని విమర్శించారు.
ఇదే సమయంలో నిన్న మొన్నటి వరకు కేంద్రాన్ని తిట్టిన చంద్రబాబు ఇంతలోనే కశ్మీర్ విషయాన్ని సాకుగా చూపి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని, చంద్రబాబుకు భవిష్యత్తు తన కళ్లముందే కనిపిస్తోందని సాయిరెడ్డి చేసిన తాజా ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.