Begin typing your search above and press return to search.
'చంద్రబాబు బొంగరంలా తిరగడమే మిగిలింది'
By: Tupaki Desk | 12 Feb 2020 11:30 AM GMTతెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేపట్టబోయే రాజకీయ యాత్రను ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు చైతన్యయాత్రను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ తో అన్ని నియోజక వర్గాలనూ చుట్టేయడానికి చంద్రబాబు నాయుడు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ యాత్రపై సహజం గానే వైరి పక్షాలు ఘాటుగా స్పందిస్తున్నాయి.
ఇటీవలే చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని నియోజకవర్గాల వైపు వెళ్లి వచ్చారు. అమరావతి పరిరక్షణ యాత్ర అంటూ చంద్రబాబు నాయుడు కొన్ని నియోజకవర్గాలకు వెళ్లి అక్కడ భిక్షాటన చేశారు. అమరావతి ఉద్యమానికి ఆ నిధులు అంటూ ప్రకటించారు. అయితే మూడు ప్రాంతాల్లో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అమరావతి ఉద్యమం నుంచి తప్పుకున్నట్టే అని పరిశీలకులు అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చైతన్య యాత్రను ప్రకటించారు.
దీనిపై వి.విజయసాయి రెడ్డి ఘాటు గా స్పందించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ ప్రస్తావిస్తూ ఘాటైన ట్వీట్ పెట్టారు. 'ప్రతిపక్ష నేతగా 9 నెలల్లో చేసిందేమిటంటే... ఇసుక మాఫియాను రక్షించేందుకు ఇస్కో... ఉస్కో అంటూ శివాలూగాడు. ‘ఇన్ సైడర్’ భూముల కోసం ప్రభుత్వాన్నికూలుస్తా... తేలుస్తా అని గాల్లో కత్తులు తిప్పాడు. అవినీతి అధికారులకు కాపలాదారయ్యాడు. పొర్లు దండాలతో బొంగరంలా తిరగడమే మిగిలింది.' అంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.