Begin typing your search above and press return to search.
తాళపత్రాలు తెచ్చినా బాబు నమ్మిరిక..
By: Tupaki Desk | 24 July 2019 8:29 AM GMTచంద్రబాబు అధికారంలో ఉన్నప్పడు తన మీడియా, నేతలతో ప్రతిపక్ష వైసీపీని ఎంత టార్గెట్ చేసి విష ప్రచారం చేశారో అందరికీ తెలిసిందే. జగన్ పై దారుణ ప్రచారంతో డిఫెన్స్ లో నెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తిట్లు పడ్డ జగన్ గెలిచాడు. చంద్రబాబు ఓడి ప్రతిపక్షానికి పరిమితమైపోయాడు. కానీ చంద్రబాబులా తెరవెనుక కాకుండా తెరముందే.. అందరికీ తెలిసేలానే చంద్రబాబు అవినీతి, టెండర్ల అక్రమాలు, రియల్ మాఫియాను సీఎం జగన్ అసెంబ్లీలో వీడియోల్లో చూపించి మరీ ఎండగడుతున్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు విరుచుకుపడుతున్నారు..
తాజాగా ఏపీ సీఎం జగన్ శ్వేత పత్రాల విడుదలపై కామెంట్ చేసిన చంద్రబాబుకు అదిరిపోయేలా షాకిచ్చారు వైసీపీ రాజ్యసభ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ‘చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ఆరు నెలల ముందు శ్వేతపత్రాల పేరుతో 10 బోగస్ పత్రాలు సృష్టించి వదిలారని.. కానీ ప్రజలు నమ్మలేదని.. ఘోరంగా ఓడించారు ’ అని విజయసాయిరెడ్డి తూర్పార పట్టారు. చంద్రబాబు ఇప్పుడు శ్వేతపత్రాలు కాదు.. తాళపత్రాలు తెచ్చినా ఆయనను ప్రజలు నమ్మే స్థితిలో లేరని దుయ్యబట్టారు.
ఇక ప్రజాసమస్యలపై వదిలేసి చంద్రబాబు కరకట్టపై కట్టిన తన నివాసం, బినామీల ఆస్తులు, అమరావతిలో తన అనుయాకులు కొన్న ఆస్తులకు రియల్ భూమ్ పడిపోవడంపై శోకాలు పెడుతున్నాడని విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో కడిగేశారు. త్వరలోనే చంద్రబాబు పోలవరం, అమరావతిలో అడ్డగోలుగా పెంచిన అంచనాలను బయటపెడుతామని స్పష్టం చేశారు. అందుకే టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిని ఎంపిక చేసిన తన బినామీల ద్వారా రియల్ వ్యాపారాన్ని బాబు చేయించాడని.. ఇప్పుడు జగన్ దాన్ని వెలికితీస్తుంటే అమరావతిని చంపేశారని గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు.