Begin typing your search above and press return to search.
చినబాబును జాకీలు పెట్టి లేపుతున్నారుగా!
By: Tupaki Desk | 6 July 2019 8:21 AM GMTవ్యంగ్య వ్యాఖ్యలు చేయటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. సమయానికి తగ్గట్లు.. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించే ఆయన ఏపీ విపక్ష నేత చంద్రబాబును.. ఆయన కుమారుడు కమ్ మాజీ మంత్రి లోకేశ్ ను ఉద్దేశించి చేసే వ్యంగ్య వ్యాఖ్యలు తరచూ వైరల్ అవుతుంటాయి.
విజయసాయి ట్వీట్లతో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. అర్థంలేని ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్న చినబాబుపై తాజాగా ఘాటు ట్వీట్ చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉండి చేయలేని ఎన్నో పనుల్ని జగన్ చేస్తున్నా.. అవేమీ కనిపించనట్లుగా వ్యవహరిస్తూ.. అదే పనిగా లేనిపోని విమర్శలంటూ ట్వీట్లు చేస్తున్న లోకేశ్ తీరును విజయసాయి తప్పుపట్టారు.
లోకేశ్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనేమో జాకీలు పెట్టి లేపుతున్నారంటూ వ్యాఖ్యానించిన ఆయన.. తండ్రి సైగ చేసి ఉంటారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఐదు వారాలే అయిందన్న స్పృహ కూడా లేకుండా ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నారన్నారు.
సీఎం కొడుకు.. మంత్రి అయి ఉండి మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్ చెల్లని కాసు అయిపోయాడన్నారు. లోకేశ్ మీద ట్వీట్ ఫైర్ అయిన విజయసాయి చంద్రబాబును విడిచిపెట్టలేదు. అవినీతి కేసుల్లో లోపల వేస్తరేమోనని అనుమానం వచ్చినప్పుడల్లా తన భద్రత గుర్తొస్తుంది. తనను అరెస్ట్ చేస్తే చుట్టూ నిలబడి రక్షణ కల్పించాలని గతంలో ప్రజలను వేడుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తనకేదైనా అయితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరని ఇప్పుడు బెదిరిస్తున్నారని.. దాడి నాటకానికి ప్లాన్ చేశారా ఏంటి? అంటూ ప్రశ్నించారు. కాస్త వ్యంగ్యం.. మరికాస్త చురకతో విజయసాయి చేసిన ట్వీట్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
విజయసాయి ట్వీట్లను యథాతధంగా చూస్తే..
+ అవినీతి కేసుల్లో లోపల వేస్తరేమోనని అనుమానం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు తన భద్రత గుర్తొస్తుంది. తనను అరెస్ట్ చేస్తే చుట్టూ నిలబడి రక్షణ కల్పించాలని గతంలో ప్రజలను వేడుకున్నారు.తనకేదైనా అయితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరని ఇప్పుడు బెదిరిస్తున్నారు.దాడి నాటకానికి ప్లాన్ చేశారా ఏంటి?
+ లోకేశ్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనేమో జాకీలు పెట్టి లేపుతున్నారు. తండ్రి సైగ చేసి ఉంటారు. కొత్త ప్రభుత్వం వచ్చి 5 వారాలే అయిందన్న సృహ కూడా లేకుండా ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నాడు. సీఎం కొడుకు, మంత్రి అయిఉండి మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్ చెల్లని కాసు అయిపోయాడు.
+ ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో గుర్తించిన ఫోభియాలను సైకాలజీ 5 కేటగిరీలుగా విభజించింది.చంద్రబాబు గారికి సైకియాట్రిక్ పరీక్షలు చేస్తే ఆరో కేటగిరి కూడా ఉందని తేలుతుంది.ఎక్కడేం జరిగినా రాష్ట్రాన్ని కడప, పులివెందులలాగా మారుస్తున్నారని పదేపదే తన అకారణ భీతిని(ఫోభియా) వ్యక్తం చేస్తుంటారాయన.