Begin typing your search above and press return to search.

విజ‌య‌సాయి రెడ్డికి ప‌ద‌వి ఇస్తే.. కేడ‌ర్ అంతా హ్యాపీ అవుతారా?

By:  Tupaki Desk   |   3 March 2022 3:30 AM GMT
విజ‌య‌సాయి రెడ్డికి ప‌ద‌వి ఇస్తే.. కేడ‌ర్ అంతా హ్యాపీ అవుతారా?
X
ఏపీ అధికార పార్టీలో తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. చిత్రంగా ఉంటున్నాయి. త‌మ‌కు గుర్తింపు లేదు.. మ‌హ‌ప్ర‌భో.. అని నెత్తీ నోరు మొత్తంకుంటున్న క్షేత్ర‌స్తాయి నాయ‌కుల‌కు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది. మ‌రోప‌క్క గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ కోసం శ్ర‌మ‌కోర్చి, చెమ‌టోడ్చి ప‌నిచేసిన వారిని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు పూర్త‌యి నా.. క్షేత్ర‌స్థాయిలో జెండా మోసిన వారి వైపు క‌న్నెత్తి చూస్తున్న‌వారు.. ప‌ట్టుమ‌ని ఆద‌రిస్తున్న‌వారు కూడా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్ధితి దారుణంగా ఉందని కొన్నాళ్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే.. దీనిని ప‌ట్టించుకోవాల్సిన పార్టీ అధిష్టానం.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని స‌రిచేయాల్సిన పార్టీ అధిష్టానం.. నిమ్మ‌కు నీరెత్తిన ట్టు వ్య‌వ‌హ‌రిస్తోందనే విమ‌ర్శ‌లు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. అంతేకాదు.. గ‌త రెండున్న‌రేళ్లుగా పార్టీలో కేడ‌ర్ ఉండా లేదా? అనే చ‌ర్చ జోరుగా కూడా సాగుతోంది. నిజానికి ఏ పార్టీకైనా కేడ‌రే ముఖ్యం.

కానీ.. ఇప్పుడు వైసీపీలో అస‌లు ఈ మాటే వినిపించ‌డం లేదు. అస‌లు ఆ ఆలోచ‌నే క‌నిపించ‌డం లేదు. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితి ఎలా ఉందంటే.. బూత్ క‌న్వీన‌ర్లు ఎక్క‌డ ఉన్నారో.. పార్టీకి తెలియ‌దు. పోనీ.. మండ‌ల‌స్థాయి క‌న్వీన‌ర్ల‌కు ఎమ్మెల్యేలు ఏమైనా ప్రాముఖ్యం ఇస్తున్నారా? అంటే ఇది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారిపోయింది.

వీరి మాట ఇలా ఉంటే.. పార్టీ అనుబంధ సంఘాలు కోకొల్లలుగా ఉన్నాయి. వీటికైనా పార్టీ కానీ, ప్ర‌భుత్వం కానీ ఏమైనా చేస్తోందా? అంటే.. అది కూడా ప్ర‌శ్న‌గానే మిగిలిపోయంది. మ‌రోవైపు.. ఏ పార్టీకైనా ఇప్పుడున్న డిజిట‌ల్ యుగంలో సోష‌ల్ మీడియా అత్యంత ప్ర‌ధానం. చిన్నా చిత‌కా పార్టీలు కూడా సోష‌ల్ మీడియా విభాగాల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి.

కానీ, వైసీపీలో మాత్రం వీరిని `రొచ్చు` అనే పెద్ద ప‌దాలు వాడి.. ప‌క్క‌న పెట్టేస్తున్నారు. ఇదంతా వైసీపీ హైక‌మాండ్ క‌నుస‌న్నల్లోనే జ‌రుగుతుండ‌డం మ‌రింత దారుణ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

నిజానికి వైసీపీకి కేడ‌ర్ అత్యంత కీల‌కం. ఈ కేడ‌ర్ లేక‌పోతే.. పార్టీనే లేదు. ఉండ‌దు అని ప్ర‌తి ఒక్క వైసీపీ నాయ‌కుడికి తెలుసు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ మాత్రం వారిని `ఎంత‌`? అని కూర‌లో క‌రివేపాకు మాదిరిగా తీసేస్తోంది. చివ‌ర‌కు వ‌లంటీర్ ఉద్యోగాల‌ను కూడా పార్టీ కేడ‌ర్‌లోని వారికి ఇవ్వ‌కుండా.. ఎమ్మెల్యేలే చ‌క్రం తిప్పార‌ని అంటున్నారు.

అదేస‌మ‌యంలో టీడీపీ సానుభూతి ప‌రుల‌కు ఈ ఉద్యోగాలు ఇచ్చార‌నే గుస‌గుస పార్టీలో జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు.. కొన్ని కాంట్రాక్టుల‌ను కూడా టీడీపీ వాల్ల‌కే ఇచ్చారు అనేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌గా వినిపిస్తోంది.

టీడీపీలో ఉన్న‌ప్పుడు సాధికార స‌ర్వే చేసి.. టీడీపీ వాళ్ల‌కి ల‌బ్ది పొందిన విష‌యం తెలిసిందే. త‌ర్వాత‌.. వైసీపీ అధికారంలోకి రావ‌డంతో అదే సాధికార స‌ర్వేకి, ప‌ధ‌కాల‌కు వీరినే వాడుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. నిజానికి వైసీపీ కేడ‌ర్‌కు అన్ని అర్హ‌త‌లు ఉన్నా.. ప‌థ‌కాలు రావ‌డం లేదు.

దీంతో గ్రామాల్లో వైసీపీ కేడ‌ర్‌.. ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌య్యారు. ఏమాత్రం ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నా.. ప్ర‌జ‌లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అంతేకాదు.. గ‌తంలో టీడీపీ హ‌యాంలోనూటీడీపీ కేడ‌ర్‌కే ప‌నులు జ‌రిగాయ‌ని, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక కూడా వారికే ప‌నులు, ప్రాధాన్యం పెరిగిపోయింద‌ని.. వైసీపీ కేడ‌ర్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది.

రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ వాళ్ల‌కే ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు స‌డెన్‌గా పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి ప‌ద‌వి ఇస్తే.. అంతా బాగు అవుతుందా? అని వారు నిల‌దీస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో ఇలా ఉన్న ప‌రిస్థితిని సాయిరెడ్డి ఏమ‌ర‌కు స‌రిచేస్తారో చూడాలి. ప‌నిచేస్తారో.. లేక ఆయ‌న కూడా ఉత్త‌మాట‌ల‌తో కాలం గ‌డుపుతారో.. చూడాల‌ని కేడ‌ర్ ఎదురు చూస్తున్నారు.