Begin typing your search above and press return to search.

అయ్యన్నకూ చినబాబూకూ జాబ్స్ ఇస్తారట...?

By:  Tupaki Desk   |   25 April 2022 12:30 AM GMT
అయ్యన్నకూ చినబాబూకూ జాబ్స్  ఇస్తారట...?
X
ఒక వైపు ఏపీలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. లక్షలాది మంది యువత సరైన ఉపాధి లేక అల్లాడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అవుతున్నా కొత్త నోటిఫికేషన్స్ లేవు, తమకు సర్కారీ కొలువులలో చేరే భాగ్యం లేదని మండిపడుతోంది నిరుద్యోగ లోకం. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక సచివాలయ ఉద్యోగాలను తీశారు. వాలంటీర్లకు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది.

అయితే జాబ్ క్యాలండర్స్ పెట్టి ఏ ఏటికి ఆ ఏడు ప్రభుత్వ ఖాళీలలో పోస్టులను భర్తీ చేస్తామన్న మాటలకు చేతలేవీ అని విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏపీలో వరసబెట్టి మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ మధ్యన తిరుపతిలో జరిగిన జాబ్ మేళా తరువాత ఇపుడు విశాఖలో నిర్వహిస్తున్నారు.

ఇక వైసీపీ జాబ్ మేళాల మీద టీడీపీ నుంచి హాట్ కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. జాబ్ లెస్ క్యాలండర్స్ రిలీజ్ చేసి ఇపుడు జాబ్ మేళాలు అని నిరుద్యోగ యువతను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. చంద్రబాబు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇస్తే ఐటీ కంపెనీల వద్ద సెక్యూరిటీ పోస్టులను ఇస్తూ జగన్ తమ గొప్ప అంతా ఇదే అని చెప్పుకుంటున్నారని అయ్యన్న ఎద్దేవా చేసారు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ అయ్యన్న అఖండ డైలాగ్స్ వల్లిస్తూ అయ్యన్న విమర్శలు చేశారు.

అయితే దీనికి కౌంటర్ అన్నట్లుగా విజయసాయిరెడ్డి గట్టిగానే మాట్లాడారు. పెద్ద కంపెనీలలో డెబ్బై వేల రూపాయలు నెల జీతం కింద నియామకాలు జాబ్ మేళాలో ఇస్తూంటే ఓర్వలేకపోతున్నారు అని మండిపడ్డారు. ఇక ఏ పనీ లేకుండా ఖాళీగా ఉన్న అయ్యన్నకు ఆయన ఇద్దరు కొడుకులకూ కూడా జాబ్ మేళాలో ఉద్యోగాలు ఉన్నాయని ఇస్తామని కూడా విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

ఇక దీనికంటే ముందు కూడా విజయసాయిరెడ్డి చంద్రబాబు వయోభారం దృష్ట్యా రిటైర్మెంట్ ఇచ్చేశామని, ఆయన కొడుకు చినబాబుకు మాత్రం జాబ్ మేళాకు వస్తే ఉద్యోగాలు ఇస్తామని సెటైర్లు వేశారు. అయితే దాని మీద కూడా అయ్యన్న తిప్పికొడుతూ ముందు రాజ్యసభ ఎంపీ పదవి పోతున్న విజయసాయిరెడ్డి, తొందరలో అధికారం పోతున్న జగన్ కూడా జాబ్ మేళాలో తమ ఉద్యోగాలను రిజర్వ్ చేసి పెట్టుకోవాలని కౌంటర్ అటాక్ చేశారు.

మొత్తానికి చూస్తే వైసీపీ జాబ్ మేళా కాదు కానీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని అటూ ఇటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి వైసీపీకి ప్రజలు జాబ్స్ ఇచ్చేశారు. మరో రెండేళ్ల పాటు ఆ జాబ్స్ పదిలం. ఆ మీదట ప్రజలు ఎవరికి జాబ్స్ ఇస్తారో, ఎవరు రాజకీయ నిరుద్యోగులులుగా మారి జాబ్ మేళాలలో జాబ్స్ వెతుక్కోవాలో చూడాల్సిందే. అప్పటిదాకా ఈ కామెంట్స్ అటూ విని జనాలు చోద్యం చిత్తగించాల్సిందే.