Begin typing your search above and press return to search.
కూకట్ పల్లిని ముంబయితో పోల్చారు!
By: Tupaki Desk | 27 Jan 2016 7:00 AM GMTవిషయం ఏదైనా అలోవకగా సబ్జెక్ట్ మాట్లాడే నేతలు కాస్త తక్కువే. అలాంటి వారిలో తెలంగాణ ఎంపీ వినోద్ కుమార్ కు ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. అలాంటి ఆయన తాజాగా ఒక కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. సీమాంధ్రులు అధికంగా ఉండే కూకట్ పల్లికి సంబంధించిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మిడ్ నైట్ బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్ అయితే.. మిడ్ నైట్ ట్రాఫిక్ జామ్ కు కూకట్ పల్లి ఫేమస్ అని వ్యాఖ్యలు చేశారు. కూకట్ పల్లిలో జనసాంద్రత చాలా ఎక్కువని.. ఈ ప్రాంతంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు. ముంబయి మహానగరం మాదిరి కూకట్ పల్లి అత్యంత జనసాంద్రత ఉన్న ప్రాంతంగా వ్యాఖ్యానించిన ఎంపీ వినోద్.. ఈ ప్రాంతాన్ని ఒక జిల్లాగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
కూకట్ పల్లిలో ట్రాఫిక్ సమస్యను నివారించి.. ప్రత్యామ్నాయ రహదారుల్ని డెవలప్ చేయాలని సూచించిన వినోద్ కుమార్.. కూకట్ పల్లిని జిల్లాగా చేయాలన్న డిమాండ్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారో..?