Begin typing your search above and press return to search.

పార్లమెంట్ కు ఇలా వచ్చి ఎంపీల సర్ ప్రైజ్

By:  Tupaki Desk   |   19 Nov 2019 6:24 AM GMT
పార్లమెంట్ కు ఇలా వచ్చి ఎంపీల సర్ ప్రైజ్
X
ప్రపంచంలోనే అత్యంత కాలుష్యనగరంగా మన దేశ రాజధాని ఢిల్లీ పేరుగాంచింది. అక్కడ చలికాలం మొదలు కావడంతో కాలుష్యంతో జనం కాకవికాలం అవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటతిరిగితే శ్వాసకోస సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. దీంతో ఎంపీలు, కేంద్రమంత్రులు పర్యావరణ హితంగా పార్లమెంట్ కు చేరుకుంటున్నారు. కాలుష్యపు వాహనాలను త్యజించారు.

తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజు పలువురు ఎంపీలు పర్యావరణ హితమైన సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలలో వచ్చి ఆశ్చర్యపరిచారు. బీజేపీ ఎంపీలు మన్ సుఖ్ మాండవీయ, మనోజ్ తివారీ సైకిల్ పై వచ్చారు. ముఖాలకు మాస్క్ లతో కనిపించారు.

కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ ఎలక్ట్రిక్ కారులో పార్లమెంట్ కు వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణాన్ని ప్రోత్సహిస్తోందని మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అందుకే తాను ఎలక్ట్రిక్ కారులో వచ్చానని వివరించాడు. ప్రజలు కూడా కాలుష్య నివారణకు ప్రజారవాణా, ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని సూచించారు.

అయితే చలికాలం మొదలు కావడం.. పంజాబ్, హర్యానాల్లో పంటలు కాల్చడంతో ఆ కాలుష్యం ఢిల్లీని కమ్మేసింది. కాలుష్యం కొంత మేర తగ్గినా గాలి నాణ్యత మాత్రం దారుణంగానే ఉంది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పార్లమెంట్ ఆవరణలో ఢిల్లీలో కాలుష్యంపై ధర్నా చేశారు.