Begin typing your search above and press return to search.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిమ్మగడ్డ హయాంలో లేనట్టే..!
By: Tupaki Desk | 12 March 2021 7:36 AM GMTఏపీ ప్రభుత్వానికి .. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కు చాలా కాలంగా కోల్డ్‌వార్ సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలు పెట్టొద్దని ప్రభుత్వం.. పెట్టి తీరాల్సిందేనని నిమ్మగడ్డ ఇలా కొంతకాలంగా సందిగ్ధత నెలకొన్నది. ఎట్టకేలకు కోర్టు తీర్పుతో ఎన్నికలు జరిగాయి. అయితే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక నిమ్మగడ్డ తన అధికారం ఏమిటో చూపించారు. వరసగా కీలక అధికారుల బదిలీలు.. మంత్రులకు వార్నింగ్‌తో ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. అయితే నిమ్మగడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని అధికార పక్షం ఆరోపణలు చేసింది.
పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ నిమ్మగడ్డ రమేశ్ సడెన్‌గా ఓ ట్విస్ట్ ఇచ్చారు. ఆయన ఆకస్మికంగా సెలవు పెట్టారు. ఈ నెల 17 నుంచి 24 వరకు సెలవులో ఉండనున్నారు.
అయితే ఇప్పటివరకు నిమ్మగడ్డను ఆకాశానికి ఎత్తేసిన ఓ వర్గం మీడియా, టీడీపీ నేతలు పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే స్వరం మార్చాయి. నిమ్మగడ్డ మారిపోయారంటూ విమర్శలు చేయడం మొదలు పెట్టాయి. ఏకంగా చంద్రబాబే ఎన్నికల సంఘం పనితీరుపై విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితుల్లో నిమ్మగడ్డ సెలవులో వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ నెల 31 తో ఆయన పదవీకాలం ముగియినున్నది.
ఇదిలా ఉంటే ఆయన 24 వరకు సెలవులో ఉండబోతున్నారు. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆయన హయాంలో జరిగే అవకాశం లేదు. అయితే ఆయన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసి పోతారా? లేక కొత్త కమిషనరే ఆ బాధ్యతలు నిర్వహిస్తారా? అన్న అంశంపై ఇంకా క్లారిటీ లేదు. కీలక టైంలో నిమ్మగడ్డ టూర్ కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.