Begin typing your search above and press return to search.
‘మిస్టర్ బీన్’ ను మళ్లీ చంపేశారు!
By: Tupaki Desk | 6 Jun 2021 11:30 AM GMT‘రోవాన్ ఎట్కిన్ సన్’ అంటే చాలా మందికి తెలియదు. కానీ.. మిస్టర్ బీన్ అంటే మాత్రం అందరికీ తెలుసు. సింగిల్ డైలాగ్ లేకుండా.. కేవలం ఎక్స్ ప్రెషన్స్, ఫిజికల్ మూమెంట్స్ తోనే కడుపుబ్బా నవ్వించే అంటే ప్రపంచం మొత్తానికీ ఇష్టమే. వరల్డ్ వైడ్ గా ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అలాంటి బీన్ చనిపోయాడంటూ ఓ వార్త సంచలనం రేకెత్తించింది. అది కూడా మిస్టర్ బీన్ ఫేస్ బుక్ పేజీలో కనిపించడంతో అందరూ నిర్ఘాంతపోయారు.
అభిమానులు షేర్లమీద షేర్లు చేశారు. తమ సంతాపం తెలిపారు. మే 29వ తేదీన వెలువడిన ఈ వార్త.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. అదొక ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. ఈ ఫేస్ బుక్ పేజీని ఎవరో మెయింటెయిన్ చేస్తున్నారు. ఇది చాలా కాలంగా ఉండడంతో అందరూ నిజమేనని నమ్మేశారు. ఇది తప్పుడు వార్త అని తెలిసిన తర్వాత నెటిజన్లు ఆ పేజీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాగా.. ప్రస్తుతం మిస్టర్ బీన్ వయసు 66 సంవత్సరాలు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే.. రోవాన్ ఎట్కిన్ సన్ చనిపోయాడంటూ వార్తలు రావడం ఇదే మొదటి సారి కాదు. ఇప్పటి వరకు ఆరు సార్లు ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం కాగా.. ఇది ఏడవసారి. 2012లో తొలిసారి బీన్ చనిపోయాడని తప్పుడు వార్త వెలుగు చూసింది. ఆ తర్వాత ఏడాదికి ఒకసారి చొప్పున 2018 వరకు ఈ ప్రచారం జరిగింది.