Begin typing your search above and press return to search.

మిస్టర్ బీన్ జీవితంలో ట్రాజెడీ

By:  Tupaki Desk   |   12 Nov 2015 6:35 AM GMT
మిస్టర్ బీన్ జీవితంలో ట్రాజెడీ
X
మిస్ట‌ర్ బీన్‌. చిన్న పిల్లలు..ఆ మాట‌కొస్తే ఎవ‌రికైనా ఈ పేరు సుప‌రిచితం. అల్ల‌రి పిల్ల‌ల గోల త‌గ్గించాలంటే మిస్ట‌ర్ బీన్ ప్రోగ్రామ్ పెట్టేయ‌డం చాలా మంది త‌ల్లిదండ్రులు చేసే ప‌ని. మిస్టర్ బీన్ పాత్ర ద్వారా స్టార్‌ గా మారిన హాలీవుడ్ న‌టుడు రోవన్ అట్కిన్‌ సన్ త‌ను కామెడీ పండిస్తూ త‌న జీవితాన్ని ట్రాజెడీ చేసుకున్నాడు. 'వింత ప్రవర్తన’ కారణంగా ఆయ‌న చిక్కుల్లో ప‌డ్డాడు.

60 అట్కిన్‌ సన్ అలియాస్ మిస్ట‌ర్‌ బీన్‌ కొంతకాలంగా తనకన్నా 24 ఏళ్లు చిన్నదైన లూయిస్ ఫోర్డ్ అనే ఓ కామెడీ నటితో లవ్ ఎఫైర్ నడుపుతున్నాడు. ఈ క్ర‌మంలో భార్య సునెట్రాకు బీన్‌ దూరంగా ఉంటున్నాడు. మేకప్ ఆర్టిస్ట్ అయిన సునెట్రాను 1990లో అట్కిన్‌ సన్ వివాహం చేసుకున్నాడు. అయితే గత 18 నెలలుగా లూయిస్ ఫోర్డ్‌ తో డేటింగ్ చేస్తుండటంతో భార్యతో అంటీ ముట్ట‌న‌ట్లు ఉంటున్నాడు. అర్థంలేని కారణాలతో తనకు దూరంగా ఉంటున్న అట్కిన్‌సన్‌ నుంచి తనకు విడాకులు ఇవ్వాల్సిందిగా సునెట్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేప‌థ్యంలో లండన్ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇలా కామెడీ స్టార్ కాస్త వ్య‌క్తిగ‌త జీవితంలో ట్రాజెడీగా మారిపోయారు.