Begin typing your search above and press return to search.

రాజుగారి కాలేజీలో ఉంది 3 స్లూడెంట్స్..1 టీచరే

By:  Tupaki Desk   |   6 Oct 2015 5:47 AM GMT
రాజుగారి కాలేజీలో ఉంది 3 స్లూడెంట్స్..1 టీచరే
X
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి సంబంధించిన సంస్థలు ఓ రేంజ్ లో వెలిగిపోతుంటాయి. అయితే.. కాలంతో పాటు వచ్చే మార్పుల్ని పెద్దగా పట్టించుకోకపోతే ఎలాంటి దుస్థితిలోకి దిగజారిపోతుందనటానికి తాజా ఉదంతమే ఒక నిదర్శనంగా చెప్పొచ్చు.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిపోయిన కాలేజీ.. ఈ రోజు అవసాన దశకు చేరుకున్న వైనం చూస్తే.. గుండె తరుక్కుపోక మానదు. అలా అని.. సదరు కాలేజికి ఎవరూ లేరా అంటే..? ఏకంగా కేంద్రమంత్రే అండగా ఉన్నారు. అయినా కూడా కాలేజీలో ఉన్న దుస్థితి మీద పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదంతా ఏపీకి చెందిన కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతి రాజుగారి కుటుంబానికి చెందింది. దీన్ని 1860లలో స్టార్ట్ చేశారు.

ఎంఆర్ కాలేజీ ఆఫ్ సాన్ స్మిట్ ఆఫ్ విజయనగరం దక్షిణాదిన ఉన్న కాలేజీల్లోకెల్లా అత్యంత పురాతమైన ఈ కాలేజీ మొన్నటి వరకూ ఓ వెలుగు వెలిగింది. 150లలో దీన్ని హైస్కూల్.. కాలేజీలుగా విడగొట్లేశారు. కాలంతో వచ్చిన మర్పులతో పాటు.. దీన్ని ఆదునీకికరించటంలో నిర్వాహకులు తీవ్రనిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు.

దీని ఫలితమే తాజా దుస్థితిగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ కాలేజీలో చదువుతున్న విద్యాథులు.. అధ్యాకుల అంశం మీడియో ప్రసారం కావటం.. మంత్రిగారు ఏలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే.. ప్రస్తుతం సదరు కాలేజీలో బోధిస్తున్న సంస్కృతం పట్ల విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తేలా మార్చటంలో చోటు చేసుకున్న వైఫల్యం తాజా పరస్థితికి కారణంగా చెబుతుండటం గమనార్హం.