Begin typing your search above and press return to search.

ఫైన్ క‌ట్టి సెల‌బ్రిటీ అయ్యాడు

By:  Tupaki Desk   |   1 Jan 2016 9:44 AM GMT
ఫైన్ క‌ట్టి సెల‌బ్రిటీ అయ్యాడు
X
ఫైన్ విధిస్తే త‌ల ప‌ట్టుకుంటాం. అన‌వ‌స‌రంగా చిక్కుకున్నామే అనుకుంటాం. బాధ ప‌డిపోతాం. కానీ.. ఒక యువ‌కుడు క‌ట్టిన జ‌రిమానా అత‌న్ని సెల‌బ్రిటీగా మార్చేసింది. జాతీయ మీడియా నుంచి అన్ని చోట్ల అత‌ని పేరు మారుమోగుతున్న ప‌రిస్థితి. జ‌రిమానా క‌ట్టినందుకు చింతించాలో.. భారీ ప్ర‌చారంతో దేశ వ్యాప్తంగా త‌న ప్ర‌స్తావ‌న మీడియాలో రావ‌టాన్ని చూసి సంతోష‌ప‌డాలో అర్థం కాక స‌త‌మ‌త‌మైపోతున్నాడు. రోజూ కొన్ని వేల మంది జ‌రిమానాలు క‌ట్టినా సెల‌బ్రిటీ కానిది.. ఇదెలా సాధ్య‌మైందంటే దానికో ప్ర‌త్యేక కార‌ణం ఉంది మ‌రి.

అదేమంటే.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని అరిక‌ట్టేందుకు వీలుగా ఢిల్లీ రాష్ట్ర స‌ర్కారు దేశంలోనే తొలిసారి వాహ‌నాల వినియోగంపై ప‌రిమితులు విధిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు (జ‌న‌వ‌రి 1) నుంచి స‌రి..బేసి విదానాన్ని అమ‌లు చేస్తున్నారు. ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం.. ఈ రోజు బేసి నెంబ‌ర్ల కార్లు మాత్ర‌మే ఢిల్లీ పౌరులు వినియోగించాల్సి ఉంది.

అయితే.. మృదుల్ యాద‌వ్ అనే ఒక సాదాసీదా ఢిల్లీ యువ‌కుడు.. త‌న‌కున్న స‌రి సంఖ్య కారును తీసుకొని రోడ్డు మీద‌కు వ‌చ్చాడు. అత‌న్ని పోలీసులు ఆపి రూ.2వేలు జ‌రిమానా విధించారు. త‌న‌కు అత్య‌వ‌స‌ర ప‌ని ఉండ‌టంతో తాను కారు తీయాల్సి వ‌చ్చింద‌ని.. త‌న‌కు స‌రి.. బేసి రూల్ గురించి తెలుస‌ని వివ‌రించాడు. త‌న ద‌గ్గ‌రున్న కార్లు అన్నీ స‌రి సంఖ్య‌ల‌తోనే ఉండ‌టంతో త‌ప్ప‌క రోడ్డు మీద‌కు రావాల్సి వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చాడు. స‌రి బేసి విధానంలో తొలి ఫైన్ క‌ట్టిన వ్య‌క్తిగా మృదుల్ యాద‌వ్ పేరు ఇప్పుడు మీడియాలో మారుమోగుతోంది. పోతే పోయింది రెండు వేలు.. ఇంత భారీ ప్ర‌చారం ఎన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చు పెడితే వ‌స్తుందంటూ వ్యాఖ్య‌లు చేస్తున్న వారు ఉండ‌టం గ‌మ‌నార్హం.