Begin typing your search above and press return to search.

క్రికెట్ కర్మయోగి.. బెస్ట్ ఫినిషర్ ధోని

By:  Tupaki Desk   |   15 Aug 2020 5:30 PM GMT
క్రికెట్ కర్మయోగి.. బెస్ట్ ఫినిషర్ ధోని
X
కర్మయోగి.. ప్రపంచకప్ ఫైనల్ అయినా సరే తొణకడు.. బెదరడు.. 6 బంతుల్లో 15 కొట్లాల్సి ఉన్నా అదే ప్రశాంతం.. ఎంతో ప్రశాంతంగా జట్టును విజయతీరాలకు చేర్చడంలో అతడు దిట్ట. అందుకే ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ మారాడు. సమకాలనీ క్రికెట్ లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మించిన సమర్థవంతమైన కెప్టెన్.. ఫినిషర్ లేరంటూ ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదేమో.. అందుకే ఇప్పుడు ధోనినే ఇప్పటిదాకా బెస్ట్ ఫినిషర్ అని దిగ్గజ క్రికెటర్లంతా మెచ్చుకుంటున్నారు. కరోనా ప్రబలడం.. ఇప్పట్లో క్రికెట్ మొదలయ్యే సూచనలు లేకపోవడంతో ఎంఎస్ ధోని.. ఇక క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ప్రపంచ క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ తీసుకొని భారత అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ధోని ప్రస్తానం గురించి తెలుసుకుందాం.

మహేంద్రసింగ్ ధోని.. భారత క్రికెట్ జట్టు రూపురేఖలు మార్చిన తూరుపు ముక్క.. ఎన్నాళ్లో వేచిన ఉన్న ప్రపంచకప్ కలల్ని సాధించిన గొప్ప యోధుడు.. అతడు వచ్చాకే భారత క్రికెట్ భాగ్యరేఖ మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.. భారత క్రికెట్ కు ఎన్నో విజయాలందించిన ఈ కర్మయోగి ఎప్పుడు గర్వపడలేదు.. ఆ విజయాలను చూసి పొంగిపోలేదు. నిదానంగా ఎంతో గుండెనిబ్బరంగల .. ఒత్తిడి అనుచుకునే ధోని అంతరంగాన్ని ఆవిష్కరించేందుకు ఇప్పుడు రంగం సిద్ధమైంది..

అప్పట్లో ధోని తన బయోపిక్ సినిమా ప్రమోషన్ కు హైదరాబాద్ రాగా.. ఈ ఫంక్షన్ ముఖ్య అతిథిగా దర్శక ధీరుడు రాజమౌళి వచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి ధోని గురించి అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచకప్ భారత్ సాధించి అప్పటికీ చాలా ఏళ్లు అయ్యింది. 1985లో కపిల్ దేవ్ సాధించారు. ఆ తర్వాత ధోని 2011లో సాధించారు. ప్రపంచకప్ గెలిచాక ధోని ఆ కప్పును సహచరులకు ఇచ్చి పక్కకు నిల్చున్నారు. లెజెండ్ సచిన్ టెండూల్కర్ సైతం భావోద్వేగాలు ఆపుకోలేకపోయాడు. కానీ ధోని నుంచి ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ రాలేదు.. అంతటి గొప్ప కర్మయోగి’’ అంటూ రాజమౌళి ధోని గురించి ధోని స్వభావం గురించి గొప్పగా చెప్పాడు.

+ 11 ఏళ్ల పాటు టీమిండియాకు సేవలందించిన ధోనీ భారత క్రికెట్ జట్టుకు ఆటగాడిగా.. కెప్టెన్ ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. అవేంటో చూద్దాం..

* 2004 డిసెంబర్ 23న మహేంద్రసింగ్ ధోనీ తొలి వన్డే మ్యాచ్
*విశాఖ సూపర్ ఇన్నింగ్స్‌తో స్టార్‌గా మారిన ధోనీ
* 2007లో మహేంద్రసింగ్‌ ధోనీకి కెప్టెన్సీ పగ్గాలు
*2014లోనే టెస్టుల నుంచి తప్పుకున్న మహేంద్రసింగ్ ధోనీ
* గతేడాది వరల్డ్‌కప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో ధోనీ చివరి మ్యాచ్‌
* 350 వన్డేల్లో 10,773 పరుగులు చేసిన ధోనీ
*90 టెస్టుల్లో 4,876 పరుగులు, 98 టీ-20 మ్యాచ్‌ల్లో 1,617 పరుగులు..
*వన్డేల్లో ధోనీ అత్యధిక స్కోర్ 183 నాటౌట్
* టెస్టుల్లో అత్యధిక స్కోర్ 224, టీ-20లో అత్యధిక స్కోర్ 56
* టెస్టుల్లో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు చేసిన ధోనీ
* వన్డేల్లో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు చేసిన ధోనీ
*టెస్టుల్లో 256 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లు, వన్డేల్లో 321 క్యాచ్‌లు, 123 స్టంపింగ్‌లు.. టీ-20ల్లో 57 క్యాచ్‌లు, 34 స్టంపింగ్‌లు
* 2007లో టీ-20, 2011లో వన్డే వరల్డ్ కప్‌లు, 2013లో ఛాంపియన్ ట్రోఫీ అందుకున్న ధోనీ
* 3 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఒకే ఒక్క కెప్టెన్‌గా ధోనీ రికార్డ్
* మూడు ఫార్మాట్లలో భారత్‌ను నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపిన ధోనీ
* ఐపీఎల్‌లో ధోనీకి తిరుగులేని రికార్డ్
- ధోనీ నాయకత్వంలో 3 సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్

+ధోనికి దక్కిన అవార్డులు
*2007-08లో ఎం.ఎస్.ధోనీకి రాజీవ్ ఖేల్‌రత్న
*2009లో పద్మశ్రీ,
*2011లో భారత సైన్యం లెఫ్ట్ నెంట్ కల్నల్ హోదా
*2018లో పద్మవిభూషణ్‌ అవార్డులు
*2008,2009లో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు