Begin typing your search above and press return to search.
సుప్రీంకోర్టు మెట్లెక్కిన ధోనీ
By: Tupaki Desk | 10 Sep 2015 3:29 PM GMTభారత మాజీ క్రికెటర్. జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. గతంలో ఓ పత్రికలో వచ్చిన కవర్ పేజ్ పై తనను మహావిష్ణువుగా చిత్రీకరిస్తూ ఫొటో వేశారు. దీంతో అప్పట్లో ధోనీ విష్ణువు ఏంటని కొందరు విమర్శలు చేశారు. తన అనుమతి లేకుండా తన ఫొటో వేసి వివాదానికి కారణమైనందున ధోనీ బిజినెస్ టుడే పత్రికపై గురువారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ ఎల్‌పీ) దాఖలు చేశాడు. 2013లో జరిగిన ఈ సంఘటనపై అప్పట్లోనే ధోనీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆ పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అలాగే బెంగళూరు అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ర్టేట్ కోర్టులో ధోనీ పై పెండింగ్ లో ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను రద్దు చేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై కూడా ధోనీ సుప్రీంలో మరో ఎస్ ఎల్ పీ దాఖలు చేశాడు. ఈ కేసును ఈ నెల 14వ తేదీన విచారిస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది.