Begin typing your search above and press return to search.
శరీరాన్ని విల్లులా వంచిన ధోనీ...వైరల్ వీడియో!
By: Tupaki Desk | 5 Nov 2017 11:35 AM GMTఇంకెన్నాళ్లు ఆడతాడు.....రిటైర్మెంట్ ఎప్పుడు?....ఈ మధ్యకాలంలో ఫిట్ గా లేడు.... ఆడింది చాలు...హుందాగా జట్టులోనుంచి తప్పుకొని యువకులకు ఛాన్స్ ఇవ్వచ్చుగా....ఇవన్నీ టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీని ఉద్దేశించి కొద్ది కాలం క్రితం వినిపించిన కామెంట్లు. ఆ విమర్శలు చేసిన వారందరికీ ధోనీ తన బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు. గత ఆరు నెలల కాలంలో జరిగిన మ్యాచ్ లలో ధోనీ....టెయిలెండర్లతో కలిసి జట్టుకు కీలకమైన విజయాలు అందించాడు. వికెట్ల మధ్య చిరుత లా పరుగెడుతూ ఫిట్ గా ఉన్నానని నిరూపించాడు. ఆసీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో కేదార్ జాదవ్ తో పోటీపడి ధోనీ 14.5 కిలోమీటర్ల స్పీడుతో రెండో పరుగు తీసిన ఘటన వైరల్ అయిన సంగతి తెలిసిందే. అదే తరహాలో తాజాగా, కివీస్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో స్టంపౌట్ కాకుండా ఉండేందుకు ధోనీ చేసిన జిమ్నాస్టిక్ ఫీట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ధోనీ కీపింగ్ లో బ్యాట్స్ మన్ ఫ్రంట్ ఫుట్ వేయాలంటే వణికిపోతారు. క్రీజులో నుంచి కాలు తీసి పెట్టేలోపు రెప్పపాటులో ధోనీ బెయిల్స్ ను గిరాటు వేస్తాడు. అందుకే, ధోనీ కీపింగ్ చేసేటపుడు ప్రత్యర్థి బ్యాట్స్ మన్ దాదాపుగా క్రీజును అంటిపెట్టుకుని ఉండేందుకు ప్రయత్నిస్తారు. వికెట్ల వెనుకే కాదు వికెట్ల ముందు కూడా ధోనీ అలర్ట్ గా ఉంటాడని మరోసారి నిరూపితమైంది. స్టంపింగ్ మెజీషియన్ ధోనీని స్టంపౌట్ చేయాలని కివీస్ వికెట్ కీపర్ ఫిలిప్స్ విశ్వప్రయత్నం చేశాడు. కివీస్ తో నిన్న జరిగిన టీ20 మ్యాచ్ లో సాంట్నార్ వేసిన 17 ఓవర్ లో ధోనీ ఫ్రంట్ పుట్ వేసి ఓ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ధోనీ కరెక్టుగా క్రీజుకు కొద్దిగా లోపలి వైపు ఉన్నాడు. అయితే, ఆ షాట్ మిస్పవడంతో కీపర్ ఫిలిప్స్...ధోనీని స్టంపౌట్ చేద్దామని చూశాడు. అప్రమత్తమైన ధోనీ తన రెండు కాళ్లను పొడవుగా చాపి జిమ్నాస్ట్ లాగా బ్యాలెన్స్ చేస్తూ ఉండిపోయాడు. గోతికాడ నక్కలా కాచుకున్న కీపర్....ధోనీ బ్యాలెన్స్ తప్పి కాలు తీస్తే ఔట్ చేద్దామని చూశాడు. అయితే, ధోనీ అతడికి ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో, చేసేదేమీ లేక ధోనీ కాలు క్రీజ్ లోపల ఉండగానే బెయిల్స్ ను పడగొట్టాడు ఫిలిప్స్. ధోనీ జిమ్నాస్టిక్ ఫీట్ కు ఫ్యాన్స్ తో పాటు సహచర ఆటగాళ్లు కూడా ఫిదా అయిపోయారు. ఈ ఫీట్ తో తాను ఇప్పటికీ ఫిట్ గానే ఉన్నానని, రాబోయే వరల్డ్ కప్ కు కూడా తనను ఎంపిక చేయొచ్చని ధోనీ ఓ మెసేజ్ ఇచ్చాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.