Begin typing your search above and press return to search.

బీజేపీ నుంచి గంభీర్ - ధోనిలు.?

By:  Tupaki Desk   |   23 Oct 2018 2:30 PM GMT
బీజేపీ నుంచి గంభీర్ - ధోనిలు.?
X
బీజేపీ తన పార్టీకి మైలేజ్ తెచ్చే ఏ అంశాన్ని వదులుకోవడం లేదు. అందుకే ప్రముఖులు, స్టార్ క్రికెటర్లు, సినీ కళాకారులను పార్టీలో చేర్చుకుంటూ 2019 ఎన్నికల్లో గెలవడానికి స్కెచ్ గీస్తోంది. తాజాగా టీమిండియా సీనియర్ క్రికెటర్లు మహేంద్రసింగ్ ధోని, గౌతం గంభీర్ లు రాజకీయాల్లోకి వస్తున్నారని.. బీజేపీ తరఫున పోటీచేస్తున్నారనే ప్రచారం ఢిల్లీలో ఊపందుకుంది. గంభీర్ - ధోనిలతో కమలనాథులు ఓ దఫా చర్చలు కూడా జరిపినట్లు ప్రముఖ పత్రిక ‘ది సండే గార్డియన్’ సంచలన కథనం ప్రచురించింది. 2019లో గంభీర్ ను ఢిల్లీ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేయించాడానికి ప్లాన్ చేస్తున్నారట..

గంభీర్ స్వస్థలం ఢిల్లీనే.. ఇటీవల ఆయన సైన్యం - కాల్పులు - దేశభక్తి అంశాలపై తనదైన శైలిలో స్పందించి సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే ధోనిని తన స్వస్థలం జార్ఖండ్ నుంచి పోటీచేయించాలని ప్రయత్నిస్తున్నారట.. ఒప్పుకోకపోతే దేశవ్యాప్తంగా వీరిద్దరినీ స్టార్ క్యాంపెయినర్ లుగా నియమించి ప్రచారం చేసుకోవాలని బీజేపీ భావిస్తోందట..

అయితే ధోని ప్రస్తుతం 2019 ప్రపంచకప్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత రిటైర్ అయ్యేందుకు నిర్ణయించుకున్నాడట.. ఇక రాజకీయ నేతలపై పరుష విమర్శలు చేసే గంభీర్ కూడా దేశావాళీ క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతానికి రాజకీయాలపై వీరిద్దరూ ఆసక్తి చూపడం లేదట.. మరి బీజేపీ ప్రతిపాదనను వీరు ఒప్పుకుంటారా లేదా అన్నది 2019 ఎన్నికల వరకూ తేలనుంది.