Begin typing your search above and press return to search.
సెకండ్ హ్యాండ్ బిజినెస్ లోకి ధోనీ ఎంట్రీ
By: Tupaki Desk | 14 Aug 2019 4:30 AM GMTఇండియన్ క్రికెట్ లో చెరగని ముద్ర వేసిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. పలు కంపెనీల్లో భాగస్వామిగా కూడా ఉన్నాడు. చిన్న కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వాటిలో భాగస్వామి అవ్వడం జరుగుతుంది. తాజాగా ధోనీ మరో చిన్న బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ముందుకు వచ్చాడు. అందుకు గాను ఆయన ఆ సంస్థలో భాగస్వామి కూడా అయినట్లుగా తెలుస్తోంది.
సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు మరియు కొనుగోలు చేసే కార్స్24 సంస్థకు ధోని అంబాసిడర్ గా వ్యవహరించడంతో పాటు ఆ కంపెనీలో భాగస్వామిగా కూడా మారాడు. కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆ కంపెనీలో ధోనీ భాగస్వామిగా మారాడంటూ మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా పాత కార్ల అమ్మకాలు కొనుగోలు భారీ ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో కార్స్ 24 కు మంచి బిజినెస్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ బిజినెస్ లోకి ధోని ఎంటర్ అయ్యి ఉంటాడని అంటున్నారు.
కార్స్ 24తో ఒప్పందం చేసుకోవడంపై ధోనీ మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉందని.. ఇదో సృజనాత్మకత బిజినెస్ అని కొత్తతరం సేవలను ఇచ్చే సంస్థలను నేను ఎంతగానో ఇస్టపడతాను. అందుకే ఇందులో నేను పెట్టుబడి పెట్టడంతో పాటు అంబాసిడర్ గా ఉండేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. సంస్థ ముందు భారీ లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాల సాధనలో తనవంతు కృషి చేస్తానంటూ ధోనీ హామీ ఇచ్చాడు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో ఆర్మీ విధులు నిర్వర్తిస్తున్న ధోని రేపు అక్కడ నుండి రాబోతున్నాడు.
కార్ట్ 24 సీఈవో విక్రమ్ చోప్రా ఈ విషయమై స్పందిస్తూ మా ఫ్యామిలీలోకి ధోనీ గారికి స్వాగతం. ఆయన దేశ ప్రజలందరికి ఆదర్శం. ఆయన నాయకత్వంలో టీం ఇండియా అద్బుత విజయాలను దక్కించుకుంది. అలాంటి ధోనీతో మా సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని అన్నాడు. త్వరలో భారీ ఎత్తున తమ ప్రాంచైజీలను విస్తరించే ఉద్దేశ్యంతో పని చేస్తున్నట్లుగా విక్రమ్ పేర్కొన్నాడు. సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకం దారుల నుండి కొనుగోలు దారులకు మద్యవర్తిగా కార్ట్ 24 పని చేస్తుంది.