Begin typing your search above and press return to search.
ధోనీ కంటే పేస్ కే వేల్యూ ఎక్కువా?
By: Tupaki Desk | 14 Jun 2016 7:05 AM GMTఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజే వేరు. క్రికెటర్లకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఇతర క్రీడల్లో ఎంత గొప్ప ఆటగాళ్లు ఉన్నా కూడా క్రికెటర్లపై ఉన్నంత క్రేజ్ వారిపై ఉండదు. ఒకప్పుడు సచిన్.. ఆ తరువాత ధోనీ.. ఇప్పుడు కోహ్లీ ఇలా ఇండియన్ క్రికెట్ లో అభిమానుల మనసును దోచుకుని రారాజుల్లా ఉన్నవారు ఉన్నారు. అయితే, క్రికెట్ లో ఈ ముగ్గురు లెజెండ్లు రాజ్యమేలిన కాలంలోనూ ఒకే ఒక్కడుగా ఇండియన్ టెన్నిస్ కు పేరు ప్రతిష్ఠలు తెచ్చిన గొప్ప ఆటగాడు లియాండర్ పేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే.. ధోనీకి క్రేజ్ ఎక్కువ ఉంటుందా? ఫేస్ కా అంటే మాత్రం ఎవరైనా ఠక్కున ధోనీ అంటారు. కానీ... తాజా ఘటన మాత్రం ధోనీ కంటే పేస్ ను అగ్రస్థానంలో నిలిపింది. అవును.. తమ అభిమాన ఆటగాళ్లు ఆడిన సామగ్రిని వేలం వేయగా అందులో పేస్ వాడిన ర్యాకెట్ మంచి ధర పలికింది.
అనారోగ్యంతో బాధపడుతున్న క్రీడాకారులను ఆదుకునేందుకు నడుంబిగించిన ఓ స్వచ్ఛంద సంస్థ - వెబ్ సైట్ కలిపి ధోనీ వాడిని క్రికెట్ కిట్.. పేస్ ఉపయోగించిన టెన్నిస్ ర్యాకెట్ ను వేలం వేసింది. ఈ వెబ్ సైట్ ధోనీ క్రికెట్ కిట్ - లింయాడర్ పేస్ టెన్నిస్ రాకెట్ తో పాటు ఇతర విలువైన వస్తువులనూ వేలంలో పెట్టింది. అయితే, వేలంలో మహేంద్రసింగ్ ధోని వాడిన క్రికెట్ కిట్ లక్ష రూపాయలకు - ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ గెలిచిన లియాండర్ పేస్ టెన్నిస్ రాకెట్ లక్షన్నరకు అమ్ముడయ్యాయి. ఇంకో విచిత్రం ఏంటంటే ప్రపంచ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ పీలే సంతకం చేసిన ఫుట్ బాల్ కంటే కూడా పేస్ ర్యాకెట్ ఎక్కువ ధర పలికింది.
ఇంతకీ పేస్ రాకెట్ ను ఎవరు కొన్నారో తెలుసా? టీమిండియా మాజీ ఆటగాడు - బెంగాల్ క్రికెట్ జట్టు కెప్టెన్ మనోజ్ తివారి దాన్ని లక్షన్నర రూపాయలకు కొనుగోలు చేశాడు. పీలే ఆటోగ్రాఫ్ చేసిన ఫుట్ బాల్ ను కోల్ కతాకు చెందిన నిర్మాత నమిత్ బజోరియా 1.10 లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఈ వేలం సందర్భంగా సమకూరిన 14 లక్షల రూపాయలను కాలేయ కేన్సర్ తో బాధితుల చికిత్సకు వినియోగించబోతున్నారు.