Begin typing your search above and press return to search.

ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్ ధోని సరికొత్త రికార్డు

By:  Tupaki Desk   |   20 Sep 2020 6:00 AM GMT
ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్ ధోని సరికొత్త రికార్డు
X
కరోనా వైరస్ మహమ్మారితో యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సందడి చేసింది. తొలి మ్యాచ్ లో డిఫెడింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కు షాకిస్తూ ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. చెన్నై కరోనా వైరస్ తో ఆటగాళ్లు దూరమైనా సత్తా చాటింది. దీంతో ధోని క్రెడిట్ మరోసారి మారుమోగిపోయింది.

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తాజా విజయంతో ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని సరికొత్త రికార్డును సృష్టించాడు. చెన్నై జట్టుకు కెప్టెన్ గా ధోనికి ఇది 100వ విజయం కావడం విశేషం. ఒక టీంకు 100 విజయాలను అందించిన తొలి కెప్టెన్ గా ఐపీఎల్ చరిత్రలోనే ధోని రికార్డ్ సృష్టించాడు.

వరల్డ్ కప్ లో భారత ఓటమి తర్వాత ఏడాదికి పైగా ఆటకు దూరంగా ఉన్న ఎంఎస్ ధోని నిన్న ఐపీఎల్ లో బరిలోకి దిగి ఉత్సాహంగా కనిపించారు. తన సత్తా తగ్గలేదని నిరూపించాడు. తనదైన వ్యూహాలతో ముంబైని ఓడించి తను ఎంత విలువైన ఆటగాడినో అందరికీ చాటిచెప్పాడు.

ఐపీఎల్ టోర్నీలో కెప్టెన్ గా ధోనికి ఇది 105వ విజయం కావడం విశేషం. 2016లో రైజింగ్ ఫూణే సూపర్ జెయింట్స్ జట్టుకు కూడా విజయాలు అందించాడు. కెప్టెన్ గా మహీ 175 మ్యాచ్ లు ఆడాడు. అందులో 105 విజయాలు .. 69 ఓటములు ఉన్నాయి.

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ధోని ఐపీఎల్ లో మాత్రం ముంబైని ఓడించడంలో పన్నిన వ్యూహాలు అందరినీ ఆకట్టుకున్నాయి.