Begin typing your search above and press return to search.
మిస్టర్ ఫిట్ః కిర్రాక్ లుక్ లో ధోనీ
By: Tupaki Desk | 17 July 2021 10:30 AM GMTతనదైన బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే మహేంద్ర సింగ్ ధోనీ.. ఫిట్ నెస్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. నిత్యం లీటర్ల కొద్దీ పాలు లాగించే ఈ జార్ఖండ్ డైనమైట్.. మద్యానికి దూరంగా ఉంటాడు. ఆ టేస్ట్ చేదుగా ఉంటుందని, అందుకే తనకు ఇష్టం ఉండదని చెబుతాడు. అదే సమయంలో.. కొందరు దాన్ని ఆస్వాదిస్తారని కూడా అర్థం చేసుకుంటాడు.
అయితే.. ఒక క్రికెటర్ గా ఫిట్ నెస్ విలువ ఏంటన్నది మహీకి వంద శాతం తెలుసు. అందుకే.. ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉండేందుకు చూస్తుంటాడు. లేటెస్ట్ గా ధోనీ లుక్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే. మొన్ననే 40వ పుట్టిన రోజు జరుపుకున్న ధోనీ.. థర్టీస్ లోనే ఉన్నట్టున్నాడు. మాంచి సానబెట్టిన ఖడ్గంలా కనిపిస్తున్నాడు. ముంబైలో ఓ ఫంక్షన్ కు హాజరైన సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరి, ఇంత ఫిట్ గా ఉండేందుకు ధోనీ ఎలాంటి వ్యాయామం చేస్తాడన్నది చాలా మందికి తెలియదు. అతను రెగ్యులర్ జిమ్ వర్కవుట్లతోపాటు ఫుట్ బాల్ ఆడుతుంటాడు. దాంతోపాటుగా గుర్రాలతోనూ రన్నింగ్ రేస్ పెట్టుకుంటాడీ జార్ఖండ్ డైనమైట్. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ధోనీ వైఫ్ సాక్షి. రాంచీలోని ఫామ్ హౌస్ లో ఈ రేస్ కొనసాగింది. రాంచీ శివార్లలో ఏడు ఎకరాల విస్తీర్ణంలో అద్దిరిపోయే ఫామ్ హౌస్ ఉంది ధోనీకి.
ఇన్ స్టాలో సాక్షి పోస్ట్ చేసిన వీడియోలో.. వైట్ కలర్ లో ఉన్న షెట్లాండ్ పోనీతో పరుగు పందెంలో పాల్గొన్నాడు. ముందుగా హార్స్ పరిగెడుతుండగా.. దాన్ని ఛేజ్ చేసేందుకు ప్రయత్నించాడు కెప్టెన్ కూల్. ఐపీఎల్ వాయిదా పడడంతో ఇంటి వద్దనే ఉంటున్న ధోనీ.. ఈ విధంగా ఎంజాయ్ చేస్తూనే.. ఫిట్ నెస్ కూడా చెక్ చేసుకుంటున్నాడు.
అయితే.. కేవలం ఫిట్ నెస్ తో మాత్రమే కాదు.. తనదైన స్టైల్ తోనూ వార్తల్లోనూ నిలుస్తున్నాడు ఈ టీమిండియా మాజీ కెప్టెన్. టీమిండియా క్రికెటర్లలో చాలా మంది ఒంటిపై టాటూలు వేసుకుంటూ ఒకేకరమైన స్టైల్ అనుసరిస్తుంటారు. కానీ.. ధోనీ అందరికన్నా భిన్నంగా ఉంటాడు. మొదట్నుంచీ ఇదే విధంగా కొనసాగాడు. 2005లో పాకిస్థాన్ పై చేసిన హీరోచిత సెంచరీతో టాక్ ఆఫ్ ది కంట్రీ అయిన ధోనీ.. ఆ సెంచరీతో ఎంతగా గుర్తింపు తెచ్చుకున్నాడో.. తన జులపాల జుట్టుతో అంతకన్నా ఫేమస్ అయ్యాడు.
ఇండియన్ క్రికెట్ టీమ్ లో నెవ్వర్ బిఫోర్ అనిపించేలా ధోనీ పెంచిన జులపాలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. చివరకు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా.. స్వయంగా ధోనీతో ఈ మాట అన్నారు. నీ ఆటతోపాటు హెయిర్ స్టైల్ కూడా సూపర్ అంటూ కితాబిచ్చారు. ఆ విధంగా కొన్నాళ్లపాటు లాంగ్ హెయిర్ ను కంటిన్యూ చేసిన ధోనీ.. ఉన్నట్టుండి రెగ్యులర్ మోడ్ లోకి మారిపోయాడు.
అయితే.. లేటెస్ట్ గా కోర మీసాలతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన కూతురితో కలిసి హాలిడే డెస్టినేషన్లో ఫొటోకు ఫోజిచ్చాడు. ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ విధంగా.. తాను బ్యాటింగ్ లోను, కెప్టెన్సీలోనే కాదు.. ఫిట్ నెస్, స్టైల్ లోనూ తోపునే అని ప్రూవ్ చేసుకుంటున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ.