Begin typing your search above and press return to search.
ధోని హేటర్స్ కు దిమ్మదిరిగింది
By: Tupaki Desk | 22 May 2016 5:54 AM GMTసినిమా హీరోలకే కాదు.. క్రికెట్ స్టార్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. అలాగే యాంటి ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఇండియన్ క్రికెట్ గ్రేటెస్ట్ కెప్టెన్లలో ఒకడైన ధోనిని ధ్వేషించేవాళ్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటారు. అతడెన్నో గొప్ప ఇన్నింగ్సులు ఆడినా.. భారత జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించినా.. ఓ వర్గం అభిమానులకు మాత్రం అతనంటే గిట్టదు. కొందరు అతడి ఆటలో టెక్నిక్ ఉండదంటారు.. ఇంకొందరు లక్ కలిసి రావడం వల్లే అతను విజయవంతం అయ్యాడంటారు. అలాంటి వాళ్లందరికీ ఈ ఐపీఎల్ మంచి అవకాశం అయింది.
ధోని ఈ ఐపీఎల్ లో బ్యాట్స్ మన్ గానే కాక.. కెప్టెన్ గానూ ఫెయిలయ్యాడు. అతడి నేతృత్వంలో కొత్త జట్టు పుణె సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్ చేరలేదు. పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో కొనసాగింది. ఐతే స్టీవ్ స్మిత్.. డుప్లెసిస్.. మిచెల్ మార్ష్ లాంటి ప్రధాన ఆటగాళ్లు గాయపడటం పుణె మీద ప్రభావం చూపిందన్న సంగతి జనాలు మరిచిపోయారు. ధోని వ్యక్తిగతంగా కూడా రాణించకపోవడంతో హేటర్స్ రెచ్చిపోయారు. గత మ్యాచ్ లో 23 బంతులాడి 8 పరుగులే చేయడంతో వాళ్ల చేతికి ఆయుధం దొరికింది.
ఐతే తన హేటర్స్ అందరికీ దిమ్మదిరిగే నాకౌట్ పంచ్ ఇచ్చాడు ధోని. పుణె ప్లేఆఫ్ రేసుకు దూరమైనప్పటికీ.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవకుండా అతను శనివారం ఆడిన ఇన్నింగ్స్ ధోని గొప్పదనాన్ని చాటిచెప్పింది. తనపనైపోయిందన్న వాళ్లందరికీ ధోని ఇచ్చింది మామూలు పంచ్ కాదు. పంజాబ్ తో మ్యాచ్ లో చివరి ఓవర్లో 23 పరుగులు చేయాల్సి ఉంటే.. ఒక వైడ్ తప్పిస్తే మిగతా 22 పరుగులు అతనే చేశాడు. రెండో బంతికి సిక్సర్.. 4, 5, 6 బంతులకు వరుసగా 4, 6, 6 బాదిన వైనం అమోఘం. రెండు డాట్ బాల్స్ పడ్డా అతను తొణకలేదు. అక్షర్ పటేల్ కొన్ని క్లిష్టమైన బంతులు వేసినా ధోని ఆగలేదు. ముఖ్యంగా చివరి బంతి యార్కర్ లాగా పడగా.. దాన్ని తనదైన శైలిలో హెలికాఫ్టర్ షాట్ ఆడి సిక్సర్ గా మలిచిన వైనం అమోఘం. ఈ ఇన్నింగ్స్ తో ధోని మీద ఈ సీజన్లో వచ్చిన విమర్శలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. మరోసారి అతను హీరో అయిపోయాడు.