Begin typing your search above and press return to search.

ధోని సంచలన నిర్ణయం.. రిటైర్ మెంటేనా?

By:  Tupaki Desk   |   3 July 2019 10:51 AM GMT
ధోని సంచలన నిర్ణయం.. రిటైర్ మెంటేనా?
X
వరల్డ్ కప్ లో ధోని నెమ్మదైన ఆటతీరు చూసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఈ వరల్డ్ కప్ లో ధోని ఏడు మ్యాచ్ లు ఆడి 93కు పైగా స్ట్రైక్ రేటుతో 233 పరుగులు చేశాడు. మంచి ఫినిషర్ గా పేరున్న ధోని ఇలా తడబడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతడిలో మునుపటి వాడి లేదని.. ధోని పని అయిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ధోని కూడా ఈ వరల్డ్ కప్ తర్వాత రిటైర్ మెంట్ ప్రకటించడానికి రెడీ అయ్యారన్న వార్తల క్రికెట్ ప్రేమికులను కలవరపాటుకు గురిచేస్తోంది.

ఈ ప్రపంచకప్ లో భారత్ ఫైనల్ కు చేరుకుంటే ధోని తన రిటైర్ మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న చర్చ క్రికెట్ వర్గాల్లో సాగుతోంది. 14న లార్డ్స్ లో జరిగే ఫైనలే ధోనికి చివరి మ్యాచ్ అన్న చర్చ సాగుతోంది. వరల్డ్ కప్ గెలిచి ధోనికి గిఫ్ట్ గా ఇవ్వాలని కోహ్లీ సేన తలపోస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

ఇప్పటికే ఈ విషయంపై ధోని బీసీసీఐ పెద్దలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ధోని తన రిటైర్ మెంట్ పై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా స్వాగతిస్తామని తాజాగా బీసీసీఐ అధికారి తెలుపడం ఈ ప్రచారానికి కారణమవుతోంది.

అయితే ధోని రిటైర్ మెంట్ పై కానీ.. ధోనిని తక్కువ చేసి చూసేందుకు కానీ బీసీసీఐ ఇప్పుడు ఇష్టపడడం లేదని సమాచారం. ఇండియా సెమీస్ చేరిన నేపథ్యంలో భారత్ ను విశ్వవిజేతగా నిలిపిన ధోని విషయంలో బీసీసీఐ వేచిచూసే ధోరణితోనే ఉందట.. ధోని లాంటి గొప్ప క్రికెటర్ భారత్ కు అన్ని ఫార్మట్ల కప్ లు అందించాడని.. వచ్చే ఆస్ట్రేలియాలో జరిగే టీట్వంటీ వరల్డ్ కప్ వరకూ ధోనిని ఆడనివ్వాలని డిసైడ్ అయ్యిందట.. అతడిని చిన్నబుచ్చే ఎలాంటి నిర్ణయాలు తీసుకోమని బీసీసీఐ చెబుతోంది. చూడాలి మరి ధోని ఈ వరల్డ్ కప్ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..