Begin typing your search above and press return to search.
ధోని బంతి కథలో అసలు నిజం
By: Tupaki Desk | 19 July 2018 10:32 AM GMTఇండియా మ్యాచ్ గెలిచిందంటే మహేంద్రసింగ్ ధోని స్టంప్స్ తీసుకుని పెవిలియన్‌కు చేరడం మామూలే. ఐతే ఈ మధ్య అందుకు అవకాశం లేకుండా పోతోంది. బంతి తాకితే లైట్లు వెలిగేలా అధునాతన సాంకేతికతతో తయారు చేసిన ఖరీదైన స్టంప్స్‌ను ఎవరికీ ఎవ్వట్లేదు. దీంతో ధోని తన అలవాటును మానుకున్నాడు. కాగా ఇంగ్లాండ్‌తో చివరి వన్డే పూర్తయిన తర్వాత ధోని.. అంపైర్ నుంచి బంతి తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే టెస్టులకు టాటా చెప్పిన ధోని.. వన్డేలు - టీ20లకు కూడా గుడ్ బై చెప్పేయబోతున్నాడని.. పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటాడని.. ఈ నేపథ్యంలో తన చివరి మ్యాచ్ కు గుర్తుగా ధోని ఆ బంతి తీసుకున్నాడని రెండు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.
ఎవ్వరి అంచనాలకు అందకుండా నిర్ణయాలు తీసుకునే ధోని.. సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించినా ప్రకటించేస్తాడని చాలామంది సందేహిస్తున్ారు. ఐతే ఈ బంతి కథలో అసలు వాస్తవం ఏంటో భారత కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. ధోని రిటైర్ కావట్లేదని ఆయన స్పష్టం చేశాడు. భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కు బంతిని చూపించడానికే ధోని దాన్ని తీసుకున్నట్లు రవిశాస్త్రి వెల్లడించాడు. బంతి ఆకారం ఎలా మారిందో చూపించి.. దాని ద్వారా ఇంగ్లాండ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనాకు వచ్చేందుకు కోచ్ భరత్ అరుణ్ కు బంతిని ఇవ్వాలనే ధోని అలా చేశాడని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ఐతే రవిశాస్త్రి మాటల్ని బట్టి కూడా ఒక నిర్ణయానికి రాలేం. ధోని ఎప్పుడేం చేస్తాడో చెప్పలేం. ఇంకా టెస్టులాడే సత్తా ఉండగానే ఆ ఫార్మాట్ కు టాటా చెప్పేశాడు ధోని. ప్రస్తుతం అతడి వయసు 37 ఏళ్లు. మునుపటిలా వేగంగా ఆడలేకపోతున్నాడు. దీంతో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరితో చెప్పించుకోకముందే ధోని రిటైర్మెంట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ అభిమానులు మాత్రం అతడిని వచ్చే ఏడాది ప్రపంచకప్ లో చూడాలనుకుంటున్నారు.