Begin typing your search above and press return to search.
డిగ్గీ అడుగుపెట్టకముందే ఒక వికెట్ పడింది!
By: Tupaki Desk | 15 Oct 2015 4:47 AM GMTరాష్ట్ర విభజన పేరుతో తాము తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయానికి ఇంకా ఎంత కాలం ఎన్నెన్ని శిక్షలు భరించాలో అని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు విచారిస్తే తప్పులేదు. ఎందుకంటే.. ఒక రాష్ట్రాన్ని మెజారిటీ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా.. అహేతుకంగా ముక్కలు చేసినందుకు వారు ఇప్పుడు దుష్ఫలితాల్ని అనుభవిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ పూర్తిగా శవాసనం వేసి ఉంది. ఎప్పటికి కోలుకుంటుందో కూడా వారికి క్లారిటీ లేదు. అదే సమయంలో.. తెలంగాణలో కూడా వారు బావుకుంటున్నది ఏమీ లేదు. ఇక్కడ గత్యంతరంలేని పరిస్థితుల్లో తమ పార్టీలో కొనసాగుతున్న వారు తప్ప గెలిచిన ఎమ్మెల్యే, ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు పలువురు గులాబీ తీర్థం పుచ్చుకుంటూనే ఉన్నారు.
తెలంగాణలోకూడా కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోతున్నదని అధిష్ఠానం భయపడుతూనే ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి వలసలకు సిద్ధపడుతున్న శ్రేణులను కట్టడి చేయడానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయసింగ్ రెండు రోజుల్లో నగరానికి రానున్నారు. ఆయన షెడ్యూలు కూడా ఖరారైంది. ప్రధానంగా గ్రేటర్ నాయకుడు దానం నాగేందర్, మరి కొందరు ముఖ్యులు తెరాసలోకి జారుకోకుండా చూడడం ఆయన టూర్ ఎజెండాలో ఉంది.
అయితే.. డిగ్గీ రాజా నగరంలో అడుగుపెట్టడానికంటె ముందే ఒక వికెట్ పడిపోయింది. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ముద్దం నర్సింహయాదవ్ తన అనుచరులతో సహా తెరాస పార్టీలో చేరిపోయారు. ఈ నియోజవకవర్గంలో గెలిచిన తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా ఇటీవల తెరాసలో చేరిపోయిన సంగతి తెలిసిందే. ఈ రకంగా ఆంధ్రోళ్ల ప్రాబల్యం బాగా ఉంటుందని అందరూ నమ్మే కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోనూ.. తెరాస , ఒకరకంగా ప్రత్యర్థులే లేరు అనేంతగా బలం పుంజుకున్నదని అనుకోవాలి. కాంగ్రెసును బాగుచేసుకోవడానికి దిగ్విజయ సింగ్ అడుగుపెట్టడానికంటె ముందే గ్రేటర్ పరిధిలో ఒక వికెట్ పడిపోయిందంటూ.. పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.