Begin typing your search above and press return to search.
వెంకయ్యపై ఫైర్ అయిన టీడీపీ సీనియర్
By: Tupaki Desk | 13 Sep 2016 5:13 AM GMTఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎపిసోడ్ లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇరుకున పడ్డట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఇటీవలే పవన్ కళ్యాణ్ సైతం ఆయనపై విమర్శలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ అయిన బీజేపీ - మిత్రపక్షమైన టీడీపీ ఆయన్ను ఒకింత గౌరవంగా చూస్తున్నాయి. అయితే టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు వెంకయ్య తీరుపై మండిపడ్డారు. ఏపీకి కేటాయించిన నిధులు - ప్యాకేజీ విషయంలో వెంకయ్య కాకి లెక్కలు చెప్పడం మానుకోవాలని ప్రజలకు వాస్తవాలు చెప్పాలని హితవు పలికారు.
విభజన సందర్భంగా నాడు రాజ్యసభలో ప్రతిపక్షహోదాలో ఉన్న ప్రస్తుత కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు - అరుణ్ జెట్లీ ఐదేళ్లు కావాలని - పదేళ్లు కావాలని అడిగారని గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలిపారు. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా అడగలేదని గాలి చెప్పారు. కాంగ్రెస్ ఐదేళ్లు ఇస్తామంటే పదేళ్లు కావాలని అడిగింది బీజేపీ నేతలేనని చెప్పారు. అయితే ఇప్పుడు మొండిచేయి చూపడం....దాన్ని సాకుగా చూపి వైకాపా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజీనామా చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ అనిశ్చితికి కారణం కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు - అరుణ్ జెట్లీ లేనని గాలి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదావల్ల ఏమి ఒరగదని - చెబుతున్న నేతలు - హోదా ఇచ్చేందుకు ఎందుకు నాన్చుతున్నారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీ కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటూనే ప్రత్యేక హోదాపై పోరు కొనసాగిస్తామని చెబుతున్న విషయం గమనించాలని కోరారు.
రాష్ట్రానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రూ.2.25లక్షల కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. రాష్ట్ర విభజన జరిగే సమయంలోనే యాక్టులో పొందుపరిచిన మేరకు 16 యూనివర్సిటీలు పెట్టారన్నారు. రోడ్లుకు రూ.60వేల కోట్లు ఇచ్చామని చెబుతున్నారన్నారు. ఈ రోడ్లు గుత్తేదారులకు పీపీపీ పద్దతిన ఇచ్చారని రోడ్లు వేసి టోల్ వసూళ్లు చేసుకుంటారన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినందున 100శాతం నిధులు కేంద్రమే ఖర్చు చేయాలన్నారు. గతంలోను జాతీయ ప్రాజెక్టులు అయిన బాక్రానంగల్ - హీరాకుడ్ లకు కేంద్రమే నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని యాక్టులో ఉందన్నారు. ఆధారాలు ఇలా ఉంటే బీజేపీ ఏపీకి ప్రత్యేకంగా ఏం చేసింది చెప్పాలని వెంకయ్య నాయుడు అన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెబుతున్న వాటిని నమ్మకానికి ప్రజలు చెవ్వులో పువ్వులు పెట్టుకోలేదని గాలి ముద్దుకృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు.