Begin typing your search above and press return to search.
బాబును మళ్లీ ఇరకాటంలో పడేసిన ముద్రగడ
By: Tupaki Desk | 9 May 2017 6:16 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరోమారు ఇరకాటంలో పడేశారు. కాపు రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న ముద్రగడ ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కాపు రిజర్వేషన్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన విధానాన్నే ఏపీ సీఎం చంద్రబాబు ఫాలో కావాలని ఆయన సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన కాపు జేఏసీ రాష్ట్ర సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిన రీతిలోనే ఏపీ సీఎం ముందుకు సాగుతున్నారని ముద్రగడ తెలిపారు. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ బిల్లు కోసం నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో కాపు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలోని 13 జిల్లాలోను పాదయాత్ర చేపడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు స్వయంగా ఇచ్చిన ఎన్నికల హామీ ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయినప్పటికీ అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. కాపు రిజర్వేషన్ విషయంలో ఉద్దేశపూర్వక జాప్యం చేస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని ముద్రగడ తెలిపారు. ఈ విషయంలో సరైన సందర్భంలో సరైన రీతిలో స్పందిస్తారని వ్యాఖ్యానించారు.