Begin typing your search above and press return to search.
బుద్ధిరావాలని కొబ్బరికాయలు కొడ్తున్నారు
By: Tupaki Desk | 30 Jan 2017 6:55 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపులు వినూత్న రీతిలో నిరసన మొదలు పెట్టారు. తునిలో కాపు ఐక్యగర్జన జరిగి ఏడాది అవుతున్న సందర్భంగా కాపు - బలిజ - తెలగ - ఒంటరి కులస్తులంతా ఆలయాలకు వెళ్ళి టెంకాయలు కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఎందుకు అంటే ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఓ బహిరంగలేఖలో తన సామాజికవర్గం వారికి ఈ మేరకు సూచించారు.
కాపు రిజర్వేషన్ల విషయాన్ని మర్చిపోయి నిద్రపోతున్న జాతిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన రాజకీయాల కోసం తట్టి లేపారని ముద్రగడ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు జరిగిన పాదయాత్ర సందర్భంగా గుర్తు చేసి మరీ కాపులకు బీసీ హోదాపై హామీలు గుప్పించారని ఈ లేఖలో ముద్రగడ గుర్తు చేశారు. కాపుల ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ తర్వాత ఈ విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడిగా తమకు ఇచ్చిన హామీని సీఎంగా నెరవేర్చాలని కోరుతూ హోదాకోసం తలపెట్టిన కాపు సత్యాగ్రహ యాత్రను రెండుసార్లు అడ్డుకున్నారని లేఖలో ముదగ్రడ వివరించారు. గాంధేయమార్గంలో ఈ యాత్రకు ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత పోలీసుల సహకారంతో ఉక్కుపాదంతో తమపై అణచివేత సాగించారన్నారు. అందుకే ఆలయాలకు వెళ్ళి భగవంతుని ముందు సాగిలపడి హక్కుల కోసం చేసే పాదయాత్రకు ఎలాంటి విఘాతం కలిగించకుండా ముఖ్యమంత్రికి సద్భుద్ధి ప్రసాదించమంటూ ప్రార్థించాలని కాపు - బలిజ, తెలగ - ఒంటరి కులస్తులకు ముద్రగడ సూచించారు.
ముద్రగడ పద్మనాభం మరో బాంబు పేల్చారు. ప్రత్యేక హోదా కోసం స్వయంగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ లు దీక్ష చేయాలని సూచించారు. అంతేకాదు.. వారి పక్కన కాస్త చోటిస్తే తాను కూడా దీక్ష చేస్తానని ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/