Begin typing your search above and press return to search.
జగన్ ని కలవడానికి ముద్రగడకు అభ్యంతరం..?
By: Tupaki Desk | 4 Feb 2022 11:02 AM GMTముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కలవాలని ఆయనకు ఉందిట. కానీ కలవలేనని చెబుతున్నారు, ఆయనే కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఈ మేరకు యధా ప్రకారం ఆయన ఒక లేఖను సీఎం కి రాశారు. ఆ లేఖ ద్వారా తన మనోగతాన్ని చెప్పుకున్నారు. ఇంతకీ జగన్ తో భేటీ కావడానికి ముద్రగడకు ఉన్న అభ్యంతరాలు ఏంటి అన్నవి ఆరా తీస్తే చాలానే అని తెలుస్తోంది. అందులో ముఖ్యమైనది, చాలా కీలకమైనది ఉంది. ఇలా జగన్ని ముద్రగడ కలవగానే ఆయన్ని కాపు ద్రోహిగా ముద్ర వేస్తారట.
తాను ఏ కారణం మీద కలసినా జరిగే ప్రచారం అదేనని ఆయన అనుమానిస్తున్నారు. మరి జగన్ కి ఎందుకు కలవాలనుకుంటున్నారు అంటే కాపుల మీద గత టీడీపీ సర్కార్ పెట్టిన కేసులన్నీ ఒక్క కలం పోటుతో జగన్ సర్కార్ ఎత్తేసింది. ఇలా వందలాది కేసులు, గోదావరి జిల్లాల నుంచి గుంటూరు దాకా వివిధ పోలీస్ స్టేషన్లలో కాపుల మీద నాడు నమోదు అయ్యాయి. అంతే కాదు, 20016లో తునిలో జరిగిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దహనం ఘటన తరువాత మొదలుపెడితే 2019 దాకా నాలుగేళ్ల పాటు ఎన్నో కేసులు కాపుల మీద పెట్టారని ముద్రగడ అంటున్నారు.
అమాయకులైన కాపు బిడ్డలు ఈ కేసుల వల్ల పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి నానా అవస్థలు పడ్డారని ఆయన ఆవేదన చెందారు. ఒక విధంగా కాపుల మీద పెట్టిన కేసులు ఎత్తేసి జగన్ వారికి విముక్తి కలిగించాలని ముద్రగడ అనడం విశేషం. ఈ విషయం తనకు చాలా సంతోషం కలిగిస్తుంది అని ఆయన చెప్పుకున్నారు.
అయితే ఈ పని కాపు జాతికి చేసినందుకు ముఖ్యమంత్రి జగన్ని కలవాలని అయితే ఉందని, ఆ విధంగా ధన్యవాదాలు చెప్పుకోవాలని కూడా ఉందని ఆయన అంటున్నారు. కానీ తాను సీఎంని కలిస్తే కాపు జాతిని అమ్మకానికి పెట్టి కోట్లాది రూపాయలతో పాటు పదవులు తీసుకున్నారు అన్న విమర్శలు వస్తాయని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు.
అలా అనిపించుకోవడం ఇష్టం లేకనే తాను కలవడంలేదని జగన్ కి లేఖలో వివరించారు. ఎవరెరవరో సీఎం ని కలుస్తున్నారని, తాను కలవాలంటే ఇలాంటి ప్రతిబంధకాలు ఎన్నో ఉన్నాయని ముద్రగడ అనడం విశేషం. ఇదంతా తాను ఎపుడో చేసిన పాపమని ఆయన పేర్కొన్నారు.
ఇవన్నీ పక్కన పెడితే కాపు ఉద్యమ సారధిగా తనకు జరిగిన అవమానాలు, తన మీద ప్రయోగించిన బూతు పురాణాలు దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తులో ఎవరూ కూడా ఉద్యమాల పేరిట రోడ్డు ఎక్కరని కూడా ముద్రగడ అంటున్నారు. మొత్తానికి ముద్రగడ ఒక విధమైన బాధను ఆవేదను కూడా రంగరించి జగన్ కి లేఖ రాయడం గమనార్హం.
మరి ఇంతకీ ఆయన తనను కాపు ద్రోహిగా ముద్ర వేస్తారు అని చెబుతోంది ఎవరు అన్నది కూడా చర్చగా ఉంది. అదే సమయంలో ముద్రగడ జగన్ ని కలవకపోయినా లేఖ రాయడం ద్వారా అందులో ధన్యవాదాలు చెప్పారు. మరి వీటి మీద కూడా రాజకీయ రచ్చ రేగుతుందేమో చూడాలి.