Begin typing your search above and press return to search.
ముద్రగడ సత్యాగ్రహం నుంచి చంద్రబాబు ఎస్కేప్
By: Tupaki Desk | 14 Oct 2016 7:46 AM GMTకాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి నిరసనలకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన గాంధీ మార్గంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని గడగడలాడించేందుకు రెడీ అవుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులకు చేసిన ద్రోహానికి నిరసనగా నవంబర్ 16 నుంచి ఐదు రోజుల పాటు సత్యాగ్రహ పాదయాత్ర చేయనున్నట్లు పద్మనాభం ప్రకటించారు.
ఆగస్టులోగా కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట తప్పారని ఆయన మండిపడ్డారు. దానికి నిరసగానే తాను పాదయాత్ర చేపడుతున్నానన్నారు. రావులపాలెం నుంచి సత్యాగ్రహ యాత్ర ప్రారంభించి, అంతర్వేదిలో ముగిస్తానని చెప్పారు. నల్ల రిబ్బన్లు ధరించి ఈ పాదయాత్ర చేస్తానన్నారు.
దీంతో కాపు రిజర్వేషన్ల కోసం మరోసారి ముద్రగడ పద్మనాభం రోడ్డెక్కుతున్నట్లు అయ్యింది. ఇంతకుముందు ఆయన తుని సమీపంలో కాపు ఐక్య గర్జన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా ప్రభుత్వం బలవంతంగా ఆయనను ఆస్పత్రికి తరలించింది. అయితే... ముద్రగడ దీక్ష సెగ నుంచి చంద్రబాబు కొంతవరకు తప్పించుకునే అవకాశాలున్నాయి. ఆయన నవంబరు 12 నుంచి పదకొండు రోజులు అమెరికాలో పర్యటించబోతుండడంతో ఆ సమయంలో చంద్రబాబుకు కాస్త రిలీఫ్ దొరికినట్టే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/