Begin typing your search above and press return to search.
ముద్రగడ బూతు పురాణం
By: Tupaki Desk | 22 Jun 2016 7:20 AM GMTపదమూడు రోజులుగా నిరాహార దీక్ష చేసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మొత్తానికి దీక్ష విమరించారు. రాజమండ్రి ఆసుపత్రి నుంచి కిర్లంపూడిలోని తన స్వగృహానికి చేరుకున్న ఆయన అక్కడ నిమ్మరసం తాగి దీక్ష విరమించారు. అయితే, అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ఇప్పుడు చర్చనీయాంవమవుతున్నాయి. ఆయన వాడిన భాష - స్పందించిన తీరుపై విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు - ప్రభుత్వంపై బూతు పురాణం అందుకున్నారు. రాయడానికి వీల్లేనట్లుగా తిట్లు తిట్టడంతో మీడియా ప్రతినిధులు కూడా మరో ప్రశ్న వేయడానికి సాహసించలేకపోయారు. పబ్లిక్ గా - మీడియాతో మాట్లాడుతూ ఆయన బూతులు మాట్లాడడంతో అంతా షాకయ్యారు.
"నా కుమారుడిని కొట్టుకుంటూ తీసుకెళతారా... లం.. కొడకా?" అంటూ ముద్రగడ తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. తన ఇంట్లో తలుపులు బద్దలు కొట్టారని - దాన్ని తప్పని చెప్పడం లేదని, దీక్ష నాలుగో రోజో - ఐదో రోజో మనిషికి సీరియస్ అయిన సమయంలో చేయాల్సిన పనిని దీక్ష ప్రారంభించిన మూడు గంటల్లో చేయడం ఏంటని ప్రశ్నించారు. తనను మాత్రం గౌరవంగానే తీసుకు వెళ్లారని - తన భార్యను దారుణాతి దారుణమైన తిట్లు తిట్టారని ఆరోపించారు. కోడల్ని - బావమరిది భార్యలను 'లం... రావే' అంటూ లాక్కెళ్లారని ఆరోపించారు. పోలీసులు తమను ఖైదీల కంటే హీనంగా చూశారని ఆరోపించారు.
కాపుల కోసం ఎన్ని అవమానాలనైనా భరిస్తానని... ఊపిరి ఉన్నంత వరకు తన జాతి కోసం పోరాడుతానని ముద్రగడ ఈ సందర్భంగా మరోసారి ప్రకటించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. హామీలను అమలు చేస్తున్నారన్న కబురు తెలిసేవరకు తాను ఏ పండుగ చేసుకోనని ప్రకటించారు. దీంతో దీన్ని ముద్రగడ కొత్త దీక్షగా పేర్కొంటున్నారు.