Begin typing your search above and press return to search.
ముద్రగడ ఆ మాట చెప్పేశారు
By: Tupaki Desk | 6 Jan 2017 6:24 AM GMTమాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన రెండో దశ పోరాటాన్ని ఒకింత ఉధృతంగా తీసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వేషన్ల ఉద్యమంలో మహిళల భూమికపై తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన రాష్ట్ర స్ధాయి మహిళా సదస్సులో ముద్రగడ ప్రారంభోపన్యాసం చేశారు. కాపులను బీసీలుగా గుర్తించాలనే ఉద్యమంలో తాను చేస్తున్న పోరాటంలో కాపు మహిళలు కూడా కీలకపాత్ర పోషించాలని ముద్రగడ పిలుపునిచ్చారు. కాపు మహిళలంతా రోడ్డు మీదకు వస్తేనే ఈ ఉద్యమం తీవ్రతరమై భావితరాల భవిష్యత్తు బాగుపడుతుందని స్పష్టంచేశారు. అంతా పోరాటం చేయకపోతే ప్రభుత్వం కదిలే పరిస్థితులు కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
13 జిల్లాల కాపు మహిళలు పాల్గొన్న ఈ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చుతానని నాటి పాదయాత్రలో చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆ హామీనే అమలుచేయాలని కోరుతున్నామన్నారు. తమ న్యామైన డిమాండ్ ను పరిష్కరించేందుకు ఇచ్చిన హామీని సైతం నిలుపుకోకపోవడంపై సీఎం చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. బీసీ కులాలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా తాము ప్రత్యేక రిజర్వేషన్లను మాత్రమే డిమాండ్ చేస్తున్నామన్నారు. తాను చేస్తున్న ఉద్యమంలో భాగస్వాములు కావాలని ముద్రగడ మహిళలను కోరారు. కాపు ఉద్యమ నేత నల్లా విష్ణుమూర్తి మాట్లాడుతూ కాపులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. చంద్రబాబు ఇచ్చిన మూడు హామీలను అమలు చేయాలన్నారు. సినీ నటి హేమ మాట్లాడుతూ తాను సినీరంగంలో ఉన్నా కాపు ఉద్యమం గురించే తెలుసుకుంటున్నారన్నారు. అవకాశాలు రాకున్నా తాను కాపు ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు. ఉద్యమంలో మహిళలు అధికంగా పాల్గొంటే ఉద్యమం మరింత జోరందుకునేదని ఇప్పటికైనా మహిళలంతా శక్తి మేరకు ఉద్యమాల్లో కలిసిరావాలని కోరారు. అంతకు ముందు సినిమారోడ్డులో ఖాళీ కంచాలపై గరిటెలతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన మహిళలు ప్రసంగిస్తూ తాము ఉద్యమంలో ముందుకుసాగుతామని, తమ జాతి భవిష్యత్ కోసం రోడ్డెక్కక తప్పడం లేదని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/