Begin typing your search above and press return to search.
బాబుకు ముద్రగడ డెడ్ లైన్ పెట్టేశారు
By: Tupaki Desk | 6 Jun 2016 10:23 AM GMTకాపుల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపు నేత.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి వార్తల్లోకి వచ్చారు. కాపుల్ని బీసీ జాబితాలో చేర్చేందుకు ఆయన తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డెడ్ లైన్ విధించారు. ఆగస్టు నాటికి కాపుల్ని బీసీ జాబితాలోకి చేర్చని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన కొన్ని డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చారు. ఈ నెల 20 నాటికి ఏపీలోని కాపుల జనాభా లెక్కల్ని తేల్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తాను చేస్తున్న ఉద్యమం మీద ఏపీ సర్కారులోని కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారని.. వారంతా పదవుల కోసమే తప్పించి మరోటి కాదని వ్యాఖ్యానించారు. పదవుల కోసం తప్పుడు ప్రచారం చేస్తూ తనను విమర్శించే కన్నా.. వారంతా కాపులకు ఎలా న్యాయం చేయాలన్న అంశం మీద దృష్టి సారించాలన్నారు.
గతంలో మాదిరి ముద్రగడ తాజా డెడ్ లైన్ ను తేలిగ్గా తీసుకోకుండా.. కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న అంశం మీద ఏపీ సర్కార్ సీరియస్ గా ఆలోచిస్తే మంచిది. దశాబ్దాల తరబడి తాము వంచనకు గురి అవుతున్నామన్న ఆగ్రహంతో ఉన్న కాపుల్లో అసంతృప్తి జ్వాలలు రేగేలా వ్యవహరించినపక్షంలో ఏపీ సర్కారు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ‘‘తుని’’ అనుభవ నేపథ్యంలో ముద్రగడ ఇచ్చిన డెడ్ లైన్ వరకూ వెయిట్ చేయకుండా అంతకు ముందే తనకున్న కమిట్ మెంట్ ను ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.