Begin typing your search above and press return to search.
ముందుకు ఉరుకుతున్న ముద్రగడ
By: Tupaki Desk | 29 Aug 2016 8:17 AM GMT మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఉద్యమానికి వేగంగా సిద్ధమవుతున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన ప్రముఖులతో దీనిపై చర్చలు జరిపేందుకు, వ్యూహాలు రచించేందుకు హైదరాబాదు చేరుకున్న ముద్రగడ ఈ రోజు కాంగ్రెస్ మాజీ ఎంపీ దాసరి నారాయణరావుతో భేటీ అయ్యారు. జూబ్లీహిల్సులోని దాసరి నివాసానికి వెళ్లిన ముద్రగడ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు సర్కారు రోజుకో మాట మాట్లాడుతోందని.. దీనిపై తాడో పేడో తేల్చుకోవాలని ముద్రగడ దాసరితో అన్నట్లు తెలుస్తోంది.
కాగా దాసరిని కలిసిన ముద్రగడ వెంట వైసీపీ నేతల అంబటి రాంబాబు తదితరులు కూడా ఉన్నారు. దాసరితో భేటీ అనంతరం చిరంజీవిని కూడా ముద్రగడ పద్మనాభం కలవనున్నారు. రేపు మరో విడత దాసరి ఇంట్లో కాపు నేతలంతా భేటీ కానున్నారు. రేపటి సమావేశం తరువాత ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తారని తెలుస్తోంది. కాగా కాపు గర్జన పేరుతో రిజర్వేషన్ ఉద్యమం ప్రారంబించిన ముద్రగడ అనంతరం ఆమరణ నిరాహారా దీక్ష కూడా చేసిన సంగతి తెలిసిందే. ఉద్యమం హింసారూపం దాల్చడం... ఆ తరువాత ముద్రగడ దీక్షను కూడా ప్రభుత్వం అణచివేయడం తెలిసిందే.
ఆయా సందర్భాల్లో కాపుల సమస్యల పరిష్కారం, రిజర్వేషన్ కోసం సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ ముద్రగడ ఆ తరువాత పలుమార్లు లేఖలు రాశారు. తాజాగా ఆయన మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. అయితే.. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కాపు ఉద్యమాన్ని ముద్రగడ ఎంతమేర ముందుకు ఉరికించగలరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వంలోని కాపు నేతలు ఉభయ గోదావరి జిల్లాల్లో ముద్రగడ ప్రభావం నుంచి కాపులను తప్పించడానికి ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశారు. దీంతో మరోసారి ముద్రగడ ప్రభావం చూపించగలరా లేదా అన్నది చూడాలి