Begin typing your search above and press return to search.
‘నమో మంజునాధా’ అంటున్న కిర్లంపూడి పోలీస్!
By: Tupaki Desk | 27 July 2017 5:22 AM GMTకిర్లంపూడి అంటే ఓ చిన్న మండల కేంద్రం మాత్రమే. మహా అయితే అక్కడో చిన్న పోలీసు స్టేషన్ ఉండొచ్చు. కానీ ఆ ఊళ్లో ఇప్పుడు వేల మంది పోలీసులు తిష్టవేసి ఉన్నారు. అక్కడ ఏదో జరిగిపోతున్నదనే భయం ప్రభుత్వానికి పుష్కలంగా ఉన్నందువలన జరిగిన ఏర్పాటు ఇది. అయితే ఈ కిర్లంపూడిలోని పోలీసులు ‘‘నమో మంజునాధా’’ అంటూ మొక్కుకోవడంలోని ఆంతర్యం ఏమిటి? అదే ఈస్టోరీ లోని అసలు మతలబు!
ముద్రగడ పద్మనాభం చేయదలచుకున్న పాదయాత్రను ప్రభుత్వం ఇంటి ప్రహరీ గేటు వద్దే అడ్డుకుని ఆయనను 24 గంటల పాటు హౌస్ అరెస్టు చేసేసింది. ఆయన కూడా ప్రభుత్వానికి కొత్త సవాళ్లు విసిరారు. కిర్లంపూడిలో పోలీసులు ఎంతకాలంపాటు నియంత్రిస్తారో చూస్తానని, పోలీసు బలగాలు వైదొలగిన వెంటనే తన పాదయాత్ర జరగుతుందని.. తమ కాపులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వానికి గుర్తు చేయడానికి పాదయాత్ర చేసి తీరుతానని ఆయన హెచ్చరించారు.
అయితే కిర్లంపూడి నుంచి పోలీసు బలగాలు తరలిపోయేది ఎప్పుడు? ఇప్పుడు వేల సంఖ్యలో అదనపు బలగాలను జిల్లా అంతటా మోహరించారు. ఎటు చూసినా.. సీఆర్పీఎఫ్ దళాలు - రోడ్ల మీద పోలీసు అవుట్ పోస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి. వీరంత ఇతర ప్రాంతాల నిమిత్తం ప్రస్తుతం పాదయాత్రను అడ్డుకునే విధుల్లో భాగంగా ఇక్కడకు వచ్చిన వారు. వీరంతా తిరిగి తమ సొంత ప్రాంతాలకు ఎప్పుడు వెళ్లాలి. ఇటువైపేమో.. పోలీసులు తప్పుకోగానే.. తాను పాదయాత్ర చేసి తీరుతానని ముద్రగడ అంటున్నారు. అంటే ప్రభుత్వం ఇప్పట్లో ఈ పోలీసులకు విముక్తి కల్పించదేమో.
మంజునాధ కమిషన్ నివేదిక ఇచ్చి.. కాపులను బీసీల్లో కలిపే నిర్ణయం తేలిన తర్వాత గానీ.. ముద్రగడ పాదయాత్ర చేయకుండా ఊరుకునే అవకాశం లేదు. అప్పటికి గానీ.. పోలీసు బలగాల్ని తొలగించడానికి ప్రభుత్వానికి ధైర్యం చాలదేమో అనేది వీరి భయం. అదే నిజమైతే గనుక.. తొందరగా నివేదిక ఇచ్చేయండి సార్ అని విన్నవించుకునేలాగా.. ఈ పోలీసులందరిలోనూ.. ‘నమో మంజునాధా’ అనే మంత్రమే ప్రతిధ్వనిస్తూ ఉండడంలో ఆశ్చర్యం ఏముంది?