Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు ముద్ర‌గ‌డ తాజా అల్టిమేటం!

By:  Tupaki Desk   |   10 Sep 2018 6:23 AM GMT
చంద్ర‌బాబుకు ముద్ర‌గ‌డ తాజా అల్టిమేటం!
X
2014 ఎన్నిక‌ల‌కు ముందు కాపులకు రిజ‌ర్వేష‌న్ల‌పై, కాపుల సంక్షేమంపై ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు ఇబ్బ‌డిముబ్బ‌డిగా హామీలు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఆ హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో కాపు ఉద్య‌మ‌నేత‌, మాజీ ఎంపీ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నేతృత్వంలో కాపులంద‌రూ రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్త‌ప‌రిచారు. తునిలో నిర‌స‌న త‌ర్వాత మ‌రోసారి నిర‌స‌న చేప‌ట్టాల‌నుకున్న ముద్ర‌గ‌డ‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ హౌస్ అరెస్టు చేయించారు. ప్ర‌స్తుతం అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న‌ క్ర‌మంలోనే మ‌రోసారి కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశం తెర‌పైకి వ‌చ్చింది. కాపుల భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై విశాఖ‌లో జ‌రిగిన స‌మావేశంలో పాల్టొన్న ముద్ర‌గ‌డ కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశంపై తాజా డిమాండ్లు విధించారు. కాపుల వ‌ల్లే చంద్ర‌బాబు అధికారంలో ఉన్నార‌ని, కానీ ఆయ‌న కాపుల సంక్షేమాన్ని విస్మ‌రించార‌ని అన్నారు. ఇప్ప‌టికైనా మించిపోయింది లేద‌ని, త‌న తాజా డిమాండ్ల‌ను చంద్ర‌బాబు నెర‌వేరిస్తే ల‌క్ష మందితో పాద‌యాత్ర నిర్వ‌హించి చంద్ర‌బాబుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతాన‌ని అన్నారు. అంతేకాకుండా, 10ల‌క్ష‌ల మంది కాపుల‌తో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి చంద్ర‌బాబును ఘ‌నంగా స‌త్క‌రిస్తాన‌న్నారు.

1) కాపుల జ‌నాభాను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని రిజ‌ర్వేష‌న్ల శాతాన్ని 5 నుంచి 10కి పెంచాలి

2) కేంద్ర ప్ర‌భుత్వానికి రాష్ట్ర ప్ర‌భుత్వం పంపించిన బిల్లును వెన‌క్కు తీసుకురావాల‌ని, తాజాగా చెప్పిన స‌వ‌ర‌ణ‌లు చేసిన అనంత‌రం అసెంబ్లీలో ఆమోదించాల‌ని ముద్ర‌గ‌డ డిమాండ్ చేశారు. గ‌వ‌ర్న‌ర్ ఆమోదంతో ఆ బిల్లును అమ‌లు చేయాల‌న్నారు.

3) త‌హ‌శీల్దారు కార్యాల‌యాల నుంచి కాపులంద‌రూ బీసీ స‌ర్టిఫికెట్లు తీసుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తినివ్వాలి.

4) త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌బోతోన్న 30 వేల ఉద్యోగాల్లో కాపుల‌కు 5 శాతం కేటాయించాలి.

5) ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించి కాపు రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేయాలి.