Begin typing your search above and press return to search.
ముద్రగడ రీ ఎంట్రీ.. ఫలితాల తర్వాత ఆ పార్టీలో చేరిక
By: Tupaki Desk | 10 May 2019 10:20 AM GMTఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎన్నో పార్టీలు మారినప్పటికీ - పలు కార్యక్రమాల ద్వారా ఆయన మంచి పేరును తెచ్చుకున్నారు. గతంలో మంత్రిగా పని చేసినా.. కాపు ఉద్యమ నేతగానే ఎక్కువ ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా 2016లో జరిగిన తుని సంఘటన తర్వాత ఆయన మరింత దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడడం.. ఆయనకు బహిరంగ లేఖలు రాయడం.. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం వంటివి చేసి హాట్ టాపిక్ గా మారారు. ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ ప్రచారం జరిగింది. కానీ, ఆయన మాత్రం నూట్రల్ గానే ఉండిపోయారు.
ఈ ప్రచారం సాగే సమయంలోనే తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ముద్రగడను తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదిపినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం నివాసంలో కాపు జేఏసీ నేతలతో టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత సమావేశం అయినట్టు గుసగుసలు వినిపించాయి. అదే తరుణంలో టీడీపీలో చేరితే ముద్రగడ పద్మనాభం కుమారుడు చల్లారెడ్డికి పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ కూడా వినిపించింది. కానీ - ఆయన మాత్రం దీనిపై ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ తర్వాత అంటే తాజా ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం.. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి వెళ్తున్నారని ఊహాగానాలు ప్రసారం అయ్యాయి. అయితే, ఆయన సైలెంట్ గానే ఉండిపోయారు.
ఇక - సార్వత్రిక ఎన్నికలు ముగిసి - ఫలితాల కోసం వేచి చూస్తున్న సమయంలో ముద్రగడ పద్మనాభం మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని సర్వేలన్నీ కోడై కూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీ నేతలతో ఆయన మంతనాలు కూడా జరిపారని సమాచారం. ముద్రగడ చేరిక విషయాన్ని వైసీపీ అధినేత దృష్టికి తీసుకెళ్లగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. వాస్తవానికి నిన్నటి ఎన్నికల్లో ఆయన వైసీపీకి మద్దతుగానే పని చేశారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇందులో నిజముందన్న వాదనలూ ఉన్నాయి. మొదటి నుంచీ జగన్ తో సన్నిహితంగా ఉన్న కారణంగానే ముద్రగడ.. వైసీపీలో చేరబోతున్నారని కొందరు కాపు నాయకులు బహిరంగంగానే చెబుతున్నారట. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది.