Begin typing your search above and press return to search.
ముద్రగడ దీక్ష వాయిదా!
By: Tupaki Desk | 10 March 2016 12:16 PM GMTకాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ తలపెట్టిన రెండో విడత దీక్షను కాపునేత - మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వాయిదా వేశారు. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తూర్పు గోదావరి జిల్లా డీఎస్పీ సూచిచండంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కాపు రిజర్వేషన్లకోసం కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ పంపని నేపథ్యంలో ఈ దీక్ష చేస్తున్నట్టు ముద్రగడ గత వారం రోజులుగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఆయన చేయాలనుకున్న దీక్షను వాయిదా వేసుకోవడం వెనుక కారణాలు ఏవైనా వున్నా... విద్యార్థులకోసమే వాయిదా వేసుకున్నట్టు ప్రకటించారు. త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. తాను రాజకీయ, ఆర్థిక పరమైన మైలేజీ కోసం ఏదీ చేయడం లేదని పునరుద్ఘాటించారు.