Begin typing your search above and press return to search.
వైద్యానికి నో అంటున్నముద్రగడ
By: Tupaki Desk | 7 Feb 2016 4:28 AM GMTకాపుల్ని బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ తో ఆందోళన చేస్తున్న మాజీ మంత్రి.. కాపు నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. శనివారం సాయంత్రం నుంచి తనకు పరీక్షలు జరిపేందుకు వైద్యుల్ని అనుమతించని ముద్రగడ.. సాయంత్రం తర్వాత ఇంట్లోని తలుపుల్ని బిగించుకొని ఎవరిని ఇంట్లోకి అనుమతించకపోవటం ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది.
శనివారం సాయంత్రానికే ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరి ఆరోగ్యం మీద ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. దీక్ష చేస్తున్న ముద్రగడను కలుసుకునేందుకు వస్తున్న రాజకీయ ప్రముఖుల్ని కూడా పోలీసులు అనుమతించకపోవటం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై ముద్రగడ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు ముద్రగడ దీక్షను విరమించేలా చేసేందుకు ఏపీ సర్కారు నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు.
గంట గంటకూ టెన్షన్ పెరిగిపోవటం.. కాపు సంఘాల నేతల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత త్వరగా ఏపీ సర్కారు నుంచి ముద్రగడ దీక్షను విరమించేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేనిపక్షంలో చంద్రబాబు సర్కారు తిప్పలు తప్పవన్న హెచ్చరికలు వెల్లువెత్తుతున్నాయి. మరి..ఈ ఇష్యూలో చంద్రబాబు సర్కారు ఎలా రియాక్ట్ అవుతారో..?